బ్లాక్‌బస్టర్ హిట్ ‘వార్’ (2019) సినిమాకి సీక్వెల్‌గా వస్తున్న ‘వార్ 2’ పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 14న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‌గా విడుదలవుతోంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. ఇప్పటికే పోస్టర్స్, ట్రైలర్, డ్యూయెట్ సాంగ్ రిలీజ్ చేయగా, వీటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్లాక్‌బస్టర్ హిట్ ‘వార్’ (2019) సినిమాకి సీక్వెల్‌గా వస్తున్న ‘వార్ 2’ పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 14న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‌గా విడుదలవుతోంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది.
దీనిలో భాగంగా ఇప్పటికే పోస్టర్స్, ట్రైలర్, డ్యూయెట్ సాంగ్ రిలీజ్ చేయగా, వీటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్-హృతిక్ మధ్య సోషల్ మీడియాలో జరిగిన ఒక సరదా గొడవ వలన వార్ 2 సినిమా దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఎక్స్ వేదికగా ‘హ్యాష్‌ట్యాగ్ వార్’ కి తెరలేపారు.
అయితే ఇదంతా తొలుత హృతిక్ రోషన్ వేసిన ఒక ట్వీట్‌తో మొదలయ్యింది. “WAR మళ్ళీ మొదలైంది! హ్యాష్‌ట్యాగ్ అన్నిదాన్ని చెబుతోంది. అప్‌డేట్స్, రివీల్స్ కోసం #HrithikvsNTR ని ఫాలో అవుతూ ఉండండి. ఇదే యాక్షన్ ప్రారంభం!” అంటూ ట్వీట్ చేశారు.
దీనిపై ఎన్టీఆర్ వెంటనే ప్రతిస్పందిస్తూ, “War2 అప్‌డేట్స్ కావాలా? హృతిక్ సర్, మనం మాట్లాడుకున్నదే గుర్తుందా? ఒకే ఒక్క హ్యాష్‌ట్యాగ్ ఉంది: #NTRvsHrithik. ఈ WAR ఇప్పుడే స్టార్ట్ అయ్యింది!” అంటూ తాను ఎంచుకున్న హ్యాష్‌ట్యాగ్‌ను ప్రాముఖ్యం ఇచ్చారు.
హృతిక్ ఈ స్పందనను సరదాగా తీసుకుంటూ, “హహా, మంచి ట్రై తారక్! కానీ అసలు హ్యాష్‌ట్యాగ్ #HrithikvsNTR – దీనిని క్లియర్‌గా ఉంచుదాం ప్లీజ్!” అని రిప్లై ఇచ్చారు. అయితే ‘దేవర’ హీరో ఎన్టీఆర్ మాత్రం తనదైన స్టైల్లో చివరికి ఇలా ట్వీట్ చేశారు – “ఒకటే చెప్పండి హృతిక్ సర్, #NTRvsHrithik అనే హ్యాష్‌ట్యాగ్‌నే బాగుంటుంది కదా! ఇదే నా గెలుపుగా ఫిక్స్ చేసేద్దాం!” అని అందులో పేర్కొన్నారు.
అయితే ఇదంతా సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కోసం చేసిన సరదా సోషల్ మీడియా యుద్ధమే అయినా, అభిమానులకు మాత్రం ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందింది!
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























