మహావతార్ నరసింహ 8 డేస్ కలెక్షన్స్

Mahavatar Narsimha 8 days collections

యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహ దేశ వ్యాప్తంగా సెన్సేషన్ సృష్టిస్తుంది.సెకండ్ వీక్ లోకి ఎంట్రీ ఇచ్చినా ఏమాత్రం స్లో అవ్వకుండా దుమ్మురేపుతోంది. ఈవారం విడుదలైన కొత్త సినిమాలను వెనక్కి నెట్టి బాక్సాఫీస్ వద్ద మొదటి స్థానంలో కొనసాగుతుంది. ఈ ఒక్క రోజే బుక్ మై షోలో 4 లక్షల 50 వేలకు పైగా టికెట్లు తెగాయి అంటే ఎలాంటి రన్ ను కొనసాగిస్తుందో అర్థం చేసుకోవచ్చు.ప్రస్తుతం బుక్ మై షోలో గంటకు 25 వేలకుపైగా బుకింగ్స్ తో ట్రెండ్ అవుతుంది.ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా సంచనాలు సృష్టిస్తుంది.కన్నడ అనే కాదు తెలుగు ,హిందీ ఇలా ప్రతి భాషలోనూ అదరగొడుతుంది. ఇక 8 రోజుల్లో ఈసినిమా దేశ వ్యాప్తంగా 60.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.దాంతో ఇండియాలో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన యానిమేటెడ్ మూవీగా రికార్డు సృష్టించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ముఖ్యంగా హిందీలో సెన్సేషనల్ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతుంది.నిన్న ఈసినిమా అక్కడ 5.30 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకుంది.దాంతో 8 రోజుల్లో హిందీ వెర్షన్ 38.12 కోట్ల నెట్ వసూళ్లను సొంతం చేసుకుంది.రేపటితో 50 కోట్ల క్లబ్ లో చేరనుంది.ఓవర్సీస్ లో 100K మార్క్ ను క్రాస్ చేసింది.

ఇక తెలుగులో లిమిటెడ్ స్క్రీన్స్ లో రిలీజ్ అవ్వగా ఎక్స్ లెంట్ వసూళ్లను రాబట్టుకుంది.అయితే కింగ్డమ్ తో పోటీ వున్న కూడా సాలిడ్ గా హోల్డ్ చేస్తూ వసూళ్లను రాబట్టుకుంటుంది.ఫుల్ రన్ లో ఈసినిమా అన్ని భాషల్లో కలిపి రేపటితో 100 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టుకోనుంది.తెలుగులో ఈసినిమాను గీతా ఆర్ట్స్ రిలీజ్ చేసింది.రేపు ఈసినిమా తెలుగు సక్సెస్ మీట్ వుండే ఛాన్స్ ఉంది. దీనికి అల్లు అరవింద్ రానున్నారు.

విష్ణువు దశ అవతారాల పురాణ గాథ ఆధారంగా అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ యానిమేటెడ్ మూవీని ప్రముఖ బ్యానర్ హోంబాలే ఫిలిమ్స్ నిర్మించింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.