వరుస పరాజయాల తరువాత విజయ్ దేవరకొండ కింగ్డమ్ తో ఎట్టకేలకు హిట్ కొట్టి కం బ్యాక్ ఇచ్చాడు.నిన్న విడుదలైన ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది.ఇక విజయ్ నెక్స్ట్ సినిమాతో బిజీ అవ్వడానికి రెడీ అవుతున్నాడు.అందులో భాగంగా టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యాయన్ తో తన 14వ సినిమా చేయనున్నాడు.ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో టాక్సీవాలా రాగ సూపర్ హిట్ అనిపించుకుంది. ఇక ఇప్పుడు ఈ కాంబో మరో సారి రిపీట్అవుతుంది . అయితే ఈసారి రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో భారీ ఎంటర్టైనర్ ను ప్లాన్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రేపటి నుండి ఈసినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది.విజయ్ మొదటి రోజు నుండే షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.ఈసినిమాలో విజయ్ రాయలసీమ యాసలో డైలాగులు చెప్పనున్నాడు.త్వరలోనే ఈసినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.
ఇక ఈసినిమా తోపాటు విజయ్ ,రవి కిరణ్ కోలా డైరెక్షన్ లో 13వ సినిమా చేయనున్నాడు.దిల్ రాజు ఈసినిమాను నిర్మించనుండగా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో రానుంది.అక్టోబర్ లో ఈసినిమా కుడా స్టార్ట్ కానుంది.విజయ్ ఈరెండు సినిమాలను బ్యాలెన్స్ చేయనున్నాడు.ఇందులో కీర్తి సురేష్ ను హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























