కింగ్డమ్ థియేటర్‌లో రాజమౌళి సందడి

Director SS Rajamouli Watched Vijay Deverakonda’s Kingdom With Family

టాలీవుడ్ మావెరిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయన విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్డమ్’ సినిమాను వీక్షించారు. ఈ మేరకు నేడు హైదరాబాద్‌లోని అపర్ణా సినిమాస్ థియేటర్‌కు తన కుటుంబంతో కలిసి విచ్చేసిన రాజమౌళి కొద్దిసేపు అక్కడ సందడి చేశారు. ఇక భారీ హైప్ మధ్య గురువారం ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో రాజమౌళి వంటి క్రాఫ్ట్ మాస్టర్‌ ఈ సినిమాను వీక్షించేందుకు థియేటర్‌కి రావడం నిజంగా అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సాధారణ ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా చూడటం చూసిన అభిమానులు ఫిదా అయిపోయారు. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ వంటి గ్లోబల్ బ్లాక్‌బస్టర్స్‌ను రూపొందించిన రాజమౌళి, ఇతర దర్శకుల పనిని ప్రశంసించడం, థియేటర్‌కి వచ్చి సినిమాలు చూడటం సినిమా పట్ల ఆయనకు గల ప్రేమను వెల్లడిస్తోంది.

ఇక ఈ సందర్బంగా అపర్ణా సినిమాస్ థియేటర్‌ వద్ద రాజమౌళిని చూసిన అభిమానులు ఆయనతో సెల్ఫీలు తీసుకోవడానికి ఉత్సాహం చూపించారు. మొత్తానికి రాజమౌళి లాంటి అగ్ర దర్శకుడు థియేటర్‌కి వచ్చి చూడడం ‘కింగ్డమ్’ సినిమా విజయానికి మరింత హైప్‌ కలిగించే అంశంగా మారింది. తొలిరోజు ఈ మూవీ దాదాపు 40 కోట్ల వసూళ్లను అందుకుంది.

‘జెర్సీ’ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా.. సత్యదేవ్, వెంకటేష్ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్‌ రవిచందర్ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందించాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ మరియు శ్రీకర స్టూడియోస్‌ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.