కింగ్డమ్‌.. ఓవర్సీస్‌లో తొలిరోజే కొట్టేసింది

Kingdom Storms North America With Over 1 Million Dollars Gross on Day 1

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘కింగ్డమ్’. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో నిన్న గ్రాండ్‌గా విడుదలైంది. ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ అంచనాలను భారీగా పెంచేసిన నేపథ్యంలో, తొలి రోజే అదిరిపోయే ఓపెనింగ్స్ అందుకుంది. అద్భుతమైన కలెక్షన్లతో బాక్సాఫీస్‌ని షేక్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ చిత్రం ఫస్ట్ డేలోనే 1 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ కలెక్షన్ వసూలు చేయడం విశేషం. ఈ మొత్తం దాదాపు రూ. 8 కోట్లకు పైగా ఉంటుంది. ఇక అమెరికాలో తెలుగు సినిమాలకు ఉన్న ఆదరణ మరోసారి ఈ వసూళ్ల ద్వారా బయటపడింది. విజయ్ దేవరకొండకి అక్కడ మంచి ఫాలోయింగ్ ఉండటంతో భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం ద్వారా ఫస్ట్ డే కలెక్షన్స్ భారీగా నమోదయ్యాయి.

యాక్షన్, ఎమోషన్, స్టైల్‌తో కూడిన ఈ సినిమా అక్కడి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ కలెక్షన్ ట్రెండ్ చూస్తే వచ్చే రోజుల్లో మరింత ఎక్కువగా వసూళ్లు జరిగే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే కింగ్డమ్ సక్సెస్‌ను టీమ్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోగా, నార్త్ అమెరికాలోని కలెక్షన్స్ ఈ చిత్రానికి అదనపు బూస్ట్‌గా మారనున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.