తమిళ హీరో శివ కార్తికేయన్ నెక్స్ట్ మదరాసి తోరానున్నాడు.స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది ఈసినిమా.షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో వుంది.ఇక ఈసినిమానుండి ఈరోజు ఫస్ట్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేశారు.ఈ ప్రోమో, సాంగ్ పై అంచనాలను పెంచేసింది.ఫుల్ సాంగ్ ఈనెల 31న సాయంత్రం 6 గంటలకు విడుదలకానుంది.అనిరుధ్ సంగీతం అందిస్తుండడంతో మదరాసి ఆడియో పై కూడా భారీ అంచనాలు వున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాలో కన్నడ నటి రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా లక్ష్మి మూవీస్ నిర్మిస్తుంది.సెప్టెంబర్ 5న ఈసినిమా పాన్ ఇండియా రిలీజ్ కానుంది.ఇక గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బందిపడుతున్న డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ మదరాసితో కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు.గత ఏడాది కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అమరన్ తరువాత శివ కార్తికేయన్ నుండి వస్తున్న సినిమా కావడంతో మదరాసి పై భారీ అంచనాలు వున్నాయి.
ఇదిలావుంటే శివ కార్తికేయన్ ప్రస్తుతం తన 25వ సినిమా పరాశక్తి లో నటిస్తున్నాడు.సుధా కొంగర ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా అథర్వ ,శ్రీలీల కీలకపాత్రల్లో నటిస్తున్నారు.జయం రవి మోహన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.వచ్చే ఏడాది పొంగల్ బరిలో ఈసినిమాను నిలుపాలని చూస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























