కూలీ తెలుగు ఈవెంట్ కూడా 

The makers have lined up a Telugu event for Coolie too

సూపర్ స్టార్ రజినీకాంత్  మచ్ అవైటెడ్  కూలీపై అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి.క్యాస్టింగ్ కి తోడు వరుస ఇండస్ట్రీ హిట్ సినిమాలను అందించిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేయడంతో కూలీపై తమిళ్ తోపాటు తెలుగులోనూ భారీ అంచనాలు వున్నాయి.ఇందులో కింగ్ నాగార్జున నెగిటివ్ రోల్ లో కనిపించనుండగా, ఉపేంద్ర ,షౌబిన్ షాహిర్, శృతి హాసన్ కీలక పాత్రల్లో నటించారు.ఇక హైప్ కి తగ్గట్లే కూలీ హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ గా చేసిన తమిళ సినిమా గా రికార్డు సృష్టించింది.థియేట్రికల్ ,నాన్ థియేట్రికల్ రూపంలో దాదాపు  600 కోట్లపైనే  బిజినెస్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈనెల 2న చెన్నైలో కూలీ ఈవెంట్ జరుగనుంది.ఇందులో ట్రైలర్ ను కూడా లాంఛ్ చేయనున్నారు.ట్రైలర్ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే  సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి.ఈ ఈవెంట్ లో అనిరుధ్ ఫర్మ్ ఫామ్ చేయనున్నాడు.అయితే తెలుగు లోనూ కూలీ ప్రీ రిలీజ్ ఈవెంట్  చేయనున్నారని సమాచారం.దీనికి కూడా అనిరుధ్ ని తీసుకొస్తారనే ప్రచారం జరుగుతుంది.త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది.దాదాపు 45 కోట్లకు ఈసినిమా తెలుగు హక్కులు దక్కించుకున్నారు సునీల్ నారంగ్. 

లోకేష్ మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్  క్యామియో రోల్ లో  మెరవనుండగా  సన్ పిక్చర్స్  నిర్మిస్తుంది.ఆగస్టు 14న  కూలీ తమిళ్, తెలుగు ,హిందీ భాషల్లో విడుదలకానుంది. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.