దుల్కర్ సల్మాన్ ‘కాంత’ టీజర్ రిలీజ్

Dulquer Salmaan's Kaantha Movie Telugu Teaser Released

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తోన్న మచ్ అవైటెడ్ పీరియాడికల్ మూవీ ‘కాంత’. ఇప్పటికే రిలీజైన ఆసక్తికరమైన ఫస్ట్ లుక్ పోస్టర్లతో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసింది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలో ప్రముఖ నటుడు సముద్రఖని కీలక పాత్ర పోషిస్తుండగా, దుల్కర్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో దుల్కర్ సల్మాన్ పుట్టినరోజును పురస్కరించుకుని, నేడు నిర్మాతలు ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ ప్రాజెక్ట్‌పై అంచనాలను మరింత పెంచింది

వెర్సటైల్ యాక్టర్ చంద్రన్, వెటరన్ రైటర్-డైరెక్టర్ అయ్య కెరీర్ ఆరంభంలో ఇద్దరి మధ్య ఉన్న ఆత్మీయత, క్రమంగా పేరు, ప్రఖ్యాతి వ‌చ్చేకొద్దీ చీలిపోయింది. అయ్య తన మొదటి హర్రర్ చిత్రం శాంతను శక్తివంతమైన కథానాయిక చుట్టూ రూపొందిస్తారు. స్టార్ అయిన చంద్రన్ క్రమంగా ఆ ప్రాజెక్ట్‌ను తన చేతుల్లోకి తీసుకుంటాడు.

అతను తన ఇమేజ్‌కు అనుగుణంగా స్క్రిప్ట్‌ను మార్చి.. అలాగే టైటిల్‌ను కూడా కాంతగా మార్చేస్తాడు. 1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే ఈ థ్రిల్లర్‌ ఎమోషనల్ ఇంటెన్సిటీతో కట్టిపడేసింది. సెట్స్‌, కాస్ట్యూమ్స్ అన్నీ అప్పటి కాలంను గుర్తు తెస్తాయి. డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ కథను అద్భుతంగా డిజైన్ చేశాడు.

దుల్కర్ సల్మాన్ తన కమాండింగ్ స్క్రీన్ ప్రజెన్స్‌తో ఆకట్టుకున్నారు. సముద్రఖని ఒక వెటరన్ ఫిల్మ్ మేకర్‌గా ఒదిగిపోయారు. భాగ్యశ్రీ బోర్సే తనదైన ముద్ర వేసింది. డాని సాంచెజ్ లోపెజ్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ, 1950ల వాతావరణాన్ని అందంగా రిక్రియేట్ చేస్తే.. రామలింగం ఆర్ట్ డైరెక్షన్ విజువల్ గ్రాండియర్‌ని మరింత పెంచింది.

ఝాను చంథర్ సంగీతం ఇంటెన్సిటీని ఎలివేట్ చేసింది. తమిళ్ ప్రభ అదనపు స్క్రీన్‌ప్లే అందించారు. లెవెలిన్ ఆంథోనీ గోన్సాల్వ్స్ ఎడిటింగ్ ఎంగేజింగ్‌గా వుంది. మొత్తానికి కాంత టీజర్ హ్యూజ్ బజ్‌ను క్రియేట్ చేసింది. ఇక టీజర్‌తో పాటుగా మూవీ విడుదల తేదీని కూడా ప్రకటించారు. సెప్టెంబర్ 12న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.