టాలీవుడ్‌లో గత కొన్నేళ్లుగా రీరిలీజ్‌ల ట్రెండ్ మొదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ట్రెండ్ జోరుగా నడుస్తోంది. స్టార్ హీరోల జన్మదిన కానుకగా, లేదా సినిమా విడుదలై డేకేడ్స్ పూర్తయిన సందర్భంగా కానీ, లేదంటే మరేదైనా విశేష సందర్భాలలో గతంలో వారు నటించి సూపర్ హిట్ అయిన సినిమాలను మరోసారి రీరిలీజ్ చేస్తున్నారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీంతో ఆయా హీరోల అభిమానులు ఆరోజున ఒకవైపు సెలబ్రేషన్స్ చేసుకుంటూ, మరోవైపు ఈ రీరిలీజ్ చిత్రాలను వీక్షిస్తూ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అదేవిధంగా ఈ ట్రెండ్ నిర్మాతలకి కూడా కాసులవర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో సినిమా ఈ లిస్టులోకి చేరింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఐకానిక్ చిత్రం ‘తమ్ముడు’ త్వరలో మళ్ళీ థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది.
పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ 4K టెక్నాలజీతో సరికొత్త హంగులతో భారీ స్థాయిలో సెప్టెంబర్ 2న రీరిలీజ్ అవుతోంది. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కాగా పవన్ కళ్యాణ్‌ను యూత్‌కి దగ్గర చేసిన చిత్రం ఇది. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా 1999 జూలై 15న విడుదలై ఘనవిజయం సాధించింది. ఆ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాకుండా పవన్‌కి విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది.
బి. శివరామకృష్ణ శ్రీ వేంకటేశ్వర ఆర్ట్ ఫిల్మ్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకి అరుణ్ ప్రసాద్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ప్రీతి జింగానియా, అదితి గోవిత్రికర్ కథానాయికలుగా నటించగా, రాజా కృష్ణమూర్తి, అచ్యుత్, సూర్య, భూపిందర్ సింగ్, చంద్రమోహన్, బ్రహ్మానందం, మల్లికార్జునరావు, అలీ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
అయితే తమ్ముడు సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల అందించిన సంగీతం హైలైట్‌గా నిలిచింది. అన్ని పాటలు సూపర్ హిట్టై చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. మ్యూజిక్ లవర్స్‌ని విశేషంగా అలరించాయి. ముఖ్యంగా ‘లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్’ పాట అయితే ఓ ఊపు ఊపేసింది. ఇప్పటికీ ఆ సాంగ్ అనేక మాధ్యమాల్లో వినబడుతూనే ఉంటుంది.
ఈ పాటలో పవన్ కళ్యాణ్ చేసిన మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలు, రియల్ స్టంట్స్ ప్రేక్షకులను ఆశ్చర్యచకితులను చేశాయి. ఈ సాంగ్ ఎంత పాపులర్ అయిందంటే..? ఇతర భాషలలో కూడా దీనిని అక్కడి స్టార్ హీరోలతో రీమేక్ చేశారు మేకర్స్. అయితే నిజం చెప్పాలంటే, ఎవరూకూడా పవన్ స్టామినాని మ్యాచ్ చేయలేకపోయారనే చెప్పాలి.
ఇక ఇన్ని విశేషాలున్న ‘తమ్ముడు’ సినిమా తిరిగి విడుదలవుతుండటం, అదికూడా పవన్ కళ్యాణ్ పుట్టినరోజున వస్తుండటంతో పవర్ స్టార్ అభిమానుల ఆనందానికి హద్దే లేకుండావుంది. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిగా ఉండటం, త్వరలోనే ఆయన హీరోగా నటిస్తున్న ‘ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ మూవీ రీరిలీజ్ కానుండటంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























