ప్రభాస్ కల్ట్ క్లాసిక్ ‘పౌర్ణమి’ మళ్ళీ థియేటర్లలోకి

Rebel Star Prabhas' Cult Classic Pournami Re-Releasing in Theatres

‘సలార్: పార్ట్ 1 – సీజ్ ఫైర్, కల్కి 2898 AD’ వంటి చిత్రాలతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్‌ అందుకున్న రెబెల్ స్టార్ ప్రభాస్ త్వరలో ‘ది రాజాసాబ్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ ఇంతకుముందెన్నడూ కనిపించని విభిన్న పాత్రలో నటిస్తున్నాడు. హర్రర్, కామెడీ,థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ పీరియాడిక్ డ్రామాలో కూడా నటిస్తున్నాడు ప్రభాస్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో డార్లింగ్ అభిమానులకు శుభవార్త అందింది. అదేంటంటే..? ప్రభాస్ హీరోగా నటించి సూపర్ హిట్ అయిన ఓల్డ్ మూవీ ఒకటి త్వరలో రీరిలీజ్‌ కానుంది. ఆయన సినీ కెరీర్‌లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ‘పౌర్ణమి’ చిత్రం మళ్ళీ థియేటర్లలోకి వస్తోంది. సెప్టెంబర్ 19వ తేదీన ఈ సినిమాను 4K టెక్నాలజీతో సరికొత్త హంగులతో భారీ స్థాయిలో రీరిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. దీంతో డార్లింగ్ అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. దీనిని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.