వార్ 2 ట్రైలర్ రిలీజ్.. దుమ్ము రేపిన ఎన్టీఆర్, హృతిక్

War 2 Trailer Released, NTR and Hrithik Light Up The Screen With Full Fire

మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోలుగా నటించిన మచ్ అవైటెడ్ హిందీ ఫిల్మ్ ‘వార్ 2’. టాప్ ప్రొడక్షన్ హౌస్ యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మించగా.. ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. కియారా అద్వానీ ఫిమేల్ లీడ్ రోల్‌ ప్లే చేయగా.. ప్రీతమ్ సంగీతం అందించాడు. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 14న విడుదలకానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో సినిమాపై హైప్‌ను మరింతగా పెంచేందుకు మేకర్స్ తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్‌ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. హృతిక్, తారక్ విన్యాసాలు అలరించాయి. డాన్స్‌లు, ఫైట్స్‌లో ఈ స్టార్ హీరోల ట్యాలెంట్ అద్భుతం. ఒకరికొకరు ఏమాత్రం తీసిపోనివిధంగా నటించారు. ఇక కియారా బ్యూటిఫుల్ స్క్రీన్ ప్రజెన్స్ అలరించింది. మొత్తానికి ట్రైలర్ ఫుల్ యాక్షన్ మోడ్‌లో ఉండి సినిమాపై అంచనాలను పెంచేస్తోంది..

కాగా ‘ఆర్ఆర్ఆర్’తో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ నటించిన మొదటి బాలీవుడ్ ఫిల్మ్ కావడంతో ఇటు టాలీవుడ్ సహా అటు హిందీ చిత్ర పరిశ్రమలోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికితోడు హృతిక్ రోషన్ ఉండటంతో ఇరువురి అభిమానులతోపాటుగా మూవీ లవర్స్ కూడా దీనిపై ఆసక్తి కనబరుస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు.

అయితే వార్ 2కి బాక్సాఫీస్ వద్ద ‘కూలీ’ రూపంలో గట్టి పోటీ ఎదురుకానుంది. సూపర్ స్టార్ రజినీకాంత్, క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా కూడా ఆగస్టు 14నే విడుదలకానుండటం తెలిసిందే. ఇక ఈ మూవీలో కింగ్ నాగార్జున కూడా నటిస్తుండడంతో తమిళంలోనే కాకుండా తెలుగులోనూ భారీ అంచనాలు వున్నాయి. ఉపేంద్ర,శృతి హాసన్ కీలక పాత్రలు పోషిస్తుండగా.. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.