తమిళ స్టార్ హీరో విజయ్ – యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా లియో.అంతకుముందు వీరి కాంబోలో వచ్చిన మాస్టర్ అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది.అయితే ఆ ప్రభావం లియోపై పడలేదు.ఎందుకంటే లోకేష్ మాస్టర్ తరువాత విక్రమ్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టి కం బ్యాక్ ఇవ్వడంతో లియో పై భారీ అంచనాలు వచ్చాయి.ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఆ అంచనాలను అందుకుంది.లోకేష్ టేకింగ్ ,విజయ్ యాక్టింగ్ ,అనిరుధ్ మ్యూజిక్ సినిమాను ఇండస్ట్రీ హిట్ గా నిలబెట్టాయి.దాదాపు 500 కోట్లకు పైనే వసూళ్లను రాబట్టుకుంది.తెలుగులో కూడా ఈసినిమా 60కోట్ల వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.అయితే సినిమాలో విజయ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పై చాలా కంప్లైంట్స్ వచ్చాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ ఎపిసోడ్ అసంపూర్తిగా ఉందంటూ చాలా మంది అభిప్రాయపడ్డారు.కానీ అందులో విజయ్ ను చూపించిన తీరుకు లోకేష్ మార్కులు కొట్టేశాడు.ఇక ఈ ఎపిసోడ్ గురించి తాజాగా లోకేష్ కనగరాజ్ స్పందించాడు.ఫ్లాష్‌బ్యాక్ ఉంచాలా వద్దా అన్న సందేహం వచ్చింది.మార్కెట్ పరంగా విజయ్ సర్‌కి డాన్స్ పెట్టాల్సి వచ్చింది అందుకే ఉంచాను.అయితే ఫ్లాష్‌బ్యాక్‌ను 30 నిమిషాల వరకు పెంచితే బాగుండేదనిపించింది కానీ థియేటర్లు ఆ రన్‌టైమ్‌ను అంగీకరించవు అందుకే అలా క్లోజ్ చేయాల్సివచ్చిందంటూ లోకేష్ చెప్పుకొచ్చాడు.
ఇక లోకేష్ నెక్స్ట్ కూలీతో రానున్నాడు.ఈసినిమా కోసం ఎప్పుడు చేయనివిధంగా ప్రమోషన్స్ చేస్తున్నాడు.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించగా నాగార్జున ,ఉపేంద్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఆగస్టు 14న కూలీ థియేటర్లలోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























