టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తోన్న మచ్ అవైటెడ్ ఫిల్మ్ ‘కింగ్డమ్’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా.. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా.. సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 31న థియేటర్లలోకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో కింగ్డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో పాటు ట్రైలర్ రిలీజ్‌ను తిరుపతిలో నిర్వహించనున్న మేకర్స్.. ప్రమోషన్స్‌ని మరింత ముమ్మురం చేశారు. దీనిలో భాగంగా స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేసింది చిత్ర యూనిట్. తాజాగా దీనికి సంబంధించిన షార్ట్ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో హీరో విజయ్ దేవరకొండ, చిత్ర దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఇద్దరినీ సందీప్ వంగా చిత్ర విశేషాలు అడిగి తెలుసుకోనున్నారు. కాగా ప్రస్తుతం ఈ ముగ్గురు కలిసున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ ఇంటర్వ్యూ ఫుల్ వీడియో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























