తెలుగు ప్రేక్షకులను అలరించిన ‘మార్గన్’ విజయం తర్వాత విజయ్ ఆంటోనీ మరో పవర్ ఫుల్ ప్రాజెక్ట్‌తో ‘భద్రకాళి’ వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాలో వాగై చంద్రశేఖర్, సునీల్ కృష్ణపాని, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, కిరణ్, రినీ బాట్, రియా జితు, మాస్టర్ కేశవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రగ్గడ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న భద్రకాళి కోపం, తిరుగుబాటు, కరప్ట్ వ్యవస్థను తుడిచిపెట్టేయాలనే ఫైర్‌తో నిండిన కథతో రూపొందుతుంది. ఇంటెన్స్ కథనం, హై-ఆక్టేన్ యాక్షన్‌తో ఈ చిత్రం సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
తెలుగులో మార్గన్ సినిమాను విజయం దిశగా నడిపించిన ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేస్తుంది. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సపోర్ట్ కూడా ఉండడంతో ప్రాజెక్ట్‌పై మంచి బజ్ ఉంది. ఇక రిలీజ్ డేట్ ఫిక్స్ కావడంతో మేకర్స్ హై ఓల్టేజ్ ప్రమోషన్స్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.
ఈ సందర్భంగా హీరో విజయ్ ఆంటోని మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. నా గత చిత్రం మార్గన్ కి అద్భుతమైన విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. సురేష్ బాబు గారికి ధన్యవాదాలు. భద్రకాళి సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. అరుణ్ ప్రభు నాకు చాలా ఇష్టమైన దర్శకుడు. వెరీ టాలెంటెడ్. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామంది ఆయన్ని గొప్పగా అభిమానిస్తారు. ఆయన ప్రొడక్షన్ మీద కూడా చాలా కంట్రోల్ ఉన్న డైరెక్టర్.”
“ఏదైతే మేము ముందు బడ్జెట్ అనుకున్నాము ఆ బడ్జెట్ ప్రకారమే ఈ సినిమాని కంప్లీట్ చేశారు. ఆయనకి అన్ని విషయాల మీద సంపూర్ణమైన అవగాహన ఉంది. రామ్ గారు ఈ సినిమాతో కొలాబరేట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఆయన నా తొలి సినిమా రిలీజ్ చేశారు. చాలా సపోర్టివ్ పర్సన్. మా కొలాబరేషన్ కంటిన్యూ అవుతుందని కోరుకుంటున్నాను.”
“ధనుంజయ గారు అద్భుతమైన ప్రొడ్యూసర్. ఏ సమస్య ఉన్న నేను ఆయనకే చెప్తుంటాను. అన్ని విషయాల్లో చాలా సపోర్ట్ గా ఉంటారు. హీరోయిన్ తృప్తి చాలా మంచి నటి. ఈ సినిమాల్లో చాలా సెటిల్ గా పెర్ఫార్మ్ చేసింది. తప్పకుండా తనకి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. సురేష్ బాబు గారు లేకపోతే మేమెంత నమ్మకంగా గా ఉండే వాళ్ళం కాదు. ఆయన రిలీజ్ చేయడమే కాదు,ప్రోడక్ట్ మీద ప్రతి విషయంలో చాలా కేరింగ్ తీసుకుంటారు. సురేష్ బాబు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.”
“ఇది నా 25వ చిత్రం. వెరీ న్యూ పొలిటికల్ జానర్. ఇప్పటివరకు ఇలాంటి సినిమా రాలేదు. గతంలో వచ్చిన పొలిటికల్ సినిమాలన్నిటికీ ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























