తెలుగు ప్రేక్షకులను అలరించిన ‘మార్గన్’ విజయం తర్వాత విజయ్ ఆంటోనీ మరో పవర్ ఫుల్ ప్రాజెక్ట్‌తో ‘భద్రకాళి’ వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాలో వాగై చంద్రశేఖర్, సునీల్ కృష్ణపాని, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, కిరణ్, రినీ బాట్, రియా జితు, మాస్టర్ కేశవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రగ్గడ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న భద్రకాళి కోపం, తిరుగుబాటు, కరప్ట్ వ్యవస్థను తుడిచిపెట్టేయాలనే ఫైర్‌తో నిండిన కథతో రూపొందుతుంది. ఇంటెన్స్ కథనం, హై-ఆక్టేన్ యాక్షన్‌తో ఈ చిత్రం సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
తెలుగులో మార్గన్ సినిమాను విజయం దిశగా నడిపించిన ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేస్తుంది. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సపోర్ట్ కూడా ఉండడంతో ప్రాజెక్ట్‌పై మంచి బజ్ ఉంది. ఇక రిలీజ్ డేట్ ఫిక్స్ కావడంతో మేకర్స్ హై ఓల్టేజ్ ప్రమోషన్స్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.
డైరెక్టర్ అరుణ్ ప్రభు మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. నా తొలి సినిమా ‘అరువి’ రిలీజ్ అయినప్పుడు తొలి ప్రశంస నాకు తెలుగు ఇండస్ట్రీ నుంచే వచ్చింది. రానా గారు, విజయ్ దేవరకొండ గారు, త్రివిక్రమ్ గారు నా వర్క్‌ని అప్రిషియేట్ చేశారు. ‘భద్రకాళి’ నా ఫస్ట్ తెలుగు రిలీజ్. ఇది పొలిటికల్ ఎంటర్టైనర్. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా రిలేటబుల్ గా ఉంటుంది. తప్పకుండా మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. విజయ్ గారికి, సురేష్ బాబు గారికి, అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు” అని అన్నారు.
ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన తృప్తి రవీంద్ర మాట్లాడుతూ.. “అరుణ్ గారికి విజయ్ గారికి ధన్యవాదాలు.ఈ సినిమా నటిచండ గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఈ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. టీమ్ అందరికీ థాంక్యు. ఈ సినిమా తప్పకుండా మీ అందరినీ అలరిస్తుంది” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























