మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘#Mega157’ (వర్కింగ్ టైటిల్)తో అలరించబోతున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హైదరాబాద్‌లో మొదటి షెడ్యూల్‌ను ఇప్పటికే ముగించిన టీమ్, ముస్సోరీలోని బ్యూటీఫుల్ హిల్ స్టేషన్‌లో రెండవ షెడ్యూల్ జరుపుకుంది. ఈ షెడ్యూల్‌లో చిరంజీవి, నయనతార సహా ప్రధాన తారాగణం పాల్గొన్నారు. రషెస్ అద్భుతంగా వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇటీవలే కేరళలో మూడో షెడ్యూల్ ప్రారంభం కాగా, నేటితో అది కూడా పూర్తయింది. ఈ సందర్భంగా చివరి రోజు షూటింగ్ ముగించుకుని చిరంజీవి, అనిల్ రావిపూడి చార్దర్డ్ ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న వీడిని పంచుకుంది చిత్ర బృందం.
కాగా ఇందులో వింటేజ్ చిరుని చూపించబోతున్నాడు అనిల్ రావిపూడి. 1990, 2000లలో చిరంజీవి గోల్డెన్ ఎరాలో కనిపించిన మెగాస్టార్ కామెడీ టైమింగ్‌ను ఈసారి మళ్లీ చూపించబోతున్నాడు. అలాగే ఈ చిత్రంలో చిరంజీవి తన అసలు పేరు ‘శివశంకర్ వరప్రసాద్’గా డ్రిల్ మాస్టర్ పాత్రలో కనిపించనుండటం విశేషం. ఇది అభిమానులకు ఒక విజువల్ ట్రీట్‌లా ఉండనుంది. ఇక ‘సైరా నరసింహారెడ్డి, గాడ్‌ఫాదర్’ తర్వాత నయనతార చిరుతో కలిసి మూడోసారి నటిస్తోంది.
ఇటీవల వచ్చిన ఫెస్టివల్ ఎంటర్‌టైనర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి, తన ట్రేడ్‌మార్క్, క్రియేట్ ప్రమోషన్స్ తో #Mega157పై ఇప్పటికే ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ కాగా, భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























