ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్‌టైనర్ ‘జూనియర్’తో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. జెనీలియా కీలక పాత్ర పోషిస్తున్నారు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా పాటలు చార్ట్‌బస్టర్ హిట్ అయ్యాయి. టీజర్, ట్రైలర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా జూలై 18న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దర్శక ధీరుడు ఎస్ఎస్. రాజమౌళి ముఖ్య అతిధిగా హాజరవడం విశేషం. ఇక మూవీ యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.
ఇక ప్రీరిలీజ్ ఈవెంట్‌లో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ.. “అందరికి నమస్కారం. సాయి గారు ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు మంచి కథతో ఒక చిన్న సినిమా చేస్తున్నారని అనుకున్నాను. కానీ శ్రీలీల, జెనీలియా, రవిచంద్రన్ గారు, దేవి శ్రీ ప్రసాద్, సెంథిల్, పీటర్, ఇలా ఒక్కొక్క ఎడిషన్ చూస్తుంటే ఒక పెద్ద సినిమాకి ఎలా అయితే నటీనటులు, టెక్నీషియన్స్ ఉంటారో అలా పెట్టుకుంటూ తీసుకెళ్లారు. చాలా పెద్ద సినిమా చేశారు.”
“సినిమా 1000 + ప్లస్ స్క్రీన్స్‌లో రిలీజ్ అవుతుందంటే దానికి కారణం ఆడియన్స్‌లో ఉన్న ఇంట్రెస్ట్. ఆడియన్స్‌కి ఈ సినిమాని ఫస్ట్ డే చూడాలనే ఆసక్తి క్రియేట్ అయ్యింది. సినిమాని ఈ లెవెల్‌కి తీసుకొచ్చిన సాయిగారిని అభినందిస్తున్నాను. జెనీలియా అప్పుడు ఎలా వుందో ఇప్పుడూ అలాగే ఉంది. సెంథిల్ ఈ సినిమాలో కొత్త జెనీలియాని చూపిస్తారని నమ్మకం ఉంది.”
“దేవి ఎప్పుడు కూడా తన మ్యూజిక్‌తో సినిమాని ఎలివేట్ చేస్తాడు. ‘వైరల్ వయ్యారి’ ఎంత వైరల్ అయిందో మళ్లీ దాని గురించి స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. ఈ సినిమాని ఫస్ట్ డే చూడాలనే ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేయించిన సాంగ్ అది. సెంథిల్ గురించి చెప్పాలంటే సొంత ఇంట్లో మనిషి గురించి చెప్పినట్టే ఉంటుంది. తను అద్భుతమైన టెక్నీషియన్. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడు. డైరెక్టర్‌ని కూడా కాంప్రమైజ్ అవ్వనివ్వడు. ఈ సినిమాకి తను బిగ్ ఎసెట్.”
“పీటర్ క్రేజీ మ్యాన్. ఇంకా ఏదో బెటర్‌గా చేయాలనే తపన తనలో ఉంటుంది. విపరీతంగా కష్టపడతాడు. పీటర్, సెంథిల్ ఇద్దరు కలిసి ఒక అబ్బాయి బాగా చేస్తున్నాడని చెప్బుతున్నారంటే.. కిరీటీకి అంతకంటే పెద్ద సర్టిఫికెట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండదు. వాళ్ళ బాగా పొగుడుతున్నారంటే ఇది నిజంగా బెస్ట్ కాంప్లిమెంట్స్. ఈ సినిమా కిరీటీని తప్పకుండా పెద్ద స్థాయికి వెళుతుంది. శ్రీలీల అద్భుతమైన డాన్సర్. తను ఇంకా పెద్దస్థాయికి వెళుతుంది.”
“రాధాకృష్ణ మూడు సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్టు మీద ఉన్నారు. ఈ సినిమా కోసమే కష్టపడ్డారు. ఇంత అద్భుతమైన ప్రాజెక్టుని బయటకు తీసుకొచ్చారు. తప్పకుండా ఈ సినిమా మంచి ఫలితాన్ని ఇచ్చి తనకు మంచి పేరు తీసుకొస్తుంది. జూలై 18న సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరూ థియేటర్స్‌లో చూడండి. పైసా వసూల్ మూవీ ఇది. అందరికీ థాంక్యు.” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























