ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్టైనర్ ‘జూనియర్’తో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. జెనీలియా కీలక పాత్ర పోషిస్తున్నారు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా పాటలు చార్ట్‌బస్టర్ హిట్ అయ్యాయి. టీజర్, ట్రైలర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా జూలై 18న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దర్శక ధీరుడు ఎస్ఎస్. రాజమౌళి ముఖ్య అతిధిగా హాజరవడం విశేషం. ఇక మూవీ యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.
ఈ సందర్భంగా హీరో కిరీటి మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. నిర్మాత సాయి గారు నామీద నమ్మకం పెట్టినందుకు ఆయనకు జీవితాంతం కృతజ్ఞతతో ఉంటాను. ఈ సినిమా నాకోసం 1% సాయి గారి కోసం 99% సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. ఒక డైరెక్టర్ పైకి వస్తే ఇండస్ట్రీకి చాలా మంచిది. రాధాకృష్ణ ఈ సినిమాతో ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.”
“జెనీలియా మేడం గారు మోస్ట్ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. ఆమె 13 సంవత్సరాల తర్వాత మళ్లీ ఈ సినిమాతో కం బ్యాక్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. చాలా అద్భుతమైన పాత్ర చేశారు. రెగ్యులర్‌గా చూసే క్యారెక్టర్ కాదు. చాలా యూనిక్‌గా ఉంటుంది. నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది సెంథిల్ గారు. ఆయనకి ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటాను.”
“దేవి గారి మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్ ఎసెట్. కళ్యాణ్ గారు అద్భుతమైన మాటలు, పాటలు రాశారు. సినిమాలో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ కంపోజ్ చేసిన పీటర్ మాస్టర్‌కి, వెంకట్ మాస్టర్‌కి థాంక్యూ. ఇందులో ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఇప్పటివరకు ఇండియన్ సినిమాలో ఎప్పుడూ చూసి ఉండరు. పీటర్ మాస్టర్ వల్లే ఆ ఫైట్ పాసిబుల్ అయింది. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.”
“ఈ సినిమా కోసం మూడేళ్లు కష్టపడ్డాము. జూలై 18న సినిమా రాబోతోంది. కష్టపడి నిజాయితీగా ప్రయత్నిస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కూడా పైకి తీసుకొస్తారు. నా కోసమే కాదు, ఈ సినిమాలో కష్టపడిన వారు చాలామంది ఉన్నారు. కొత్త యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరి కోసం ఈ సినిమాకి ప్రోత్సాహాన్ని ఇవ్వాలని, విజయాన్ని అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. జై ఎన్టీఆర్. థాంక్యూ ఆల్” అని అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























