మచ్ అవైటెడ్ మూవీ కింగ్డమ్ మరో రెండు వారాల్లో థియేటర్లలోకి రానుంది.ఇంతకుముందు పలు సార్లు రిలీజ్ వాయిదా పడగా ఈసారి మాత్రం పక్కగా రిలీజ్ కానుంది.సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.ఇక ఈసినిమా ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయ్యింది.అన్ని భాషలకు గాను నెట్ ఫ్లిక్స్ ఈసినిమాను దక్కించుకుంది.ఇందుకోసం భారీ మొత్తాన్ని చెల్లించనుంది.విజయ్ గత సినిమాల ప్రభావం ఈ డీల్ పై పడలేదు.విజయ్ కెరీర్ లో హైయెస్ట్ ఓటీటీ బిజినెస్ చేసింది కింగ్డమ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.నాగవంశీ ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.ఈ రోజు ఈసినిమా నుండి సెకండ్ సింగిల్ రానుంది.హిట్ టాక్ వస్తే విజయ్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించనుంది కింగ్డమ్.మరి ఈసినిమాతో విజయ్ హిట్ కొట్టి ఫామ్ లోకి వస్తాడో చూడాలి.
ఇక విజయ్ ప్రస్తుతం మరో రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు.అందులో టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యాయన్ తో తన 14వ సినిమా చేయనున్నాడు.త్వరలోనే ఈసినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.ఈసినిమాతోపాటు విజయ్ ,రవికిరణ్ కోలా డైరెక్షన్ లో రౌడీ జనార్దన్ చేయనున్నాడు.దిల్ రాజు ఈసినిమా ను నిర్మించనున్నారు.ఈరెండు సినిమాలను బ్యాలన్స్ చేయనున్నాడు విజయ్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























