బొమ్మరిల్లు తర్వాత మళ్ళీ 3 బీహెచ్‌కే లో అది చూస్తారు – సిద్ధార్థ్

Hero Siddharth Recalls Bommarillu at 3 BHK Trailer Launch Event

హీరో సిద్ధార్థ్ 40వ మూవీ ‘3 BHK’. శ్రీ గణేష్ దర్శకత్వం వహించారు. పోస్టర్లు, టీజర్లు, పాటలతో సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది. ప్రముఖ నటుడు శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తుండగా, దేవయాని, యోగి బాబు, మీతా రఘునాథ్, చైత్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ నిర్మించిన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ తాజాగా విడుదలైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో సిద్ధార్థ్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. 3 బీహెచ్‌కే మూవీ ఫ్యామిలీని మీకు పరిచయం చేయాలి. అరుణ్ విశ్వా ఎక్సైటింగ్ ప్రొడ్యూసర్. ఈ సినిమా ఒక రియల్ లైఫ్ నుంచి వచ్చిన కథ. ఈ సినిమా చూసిన తర్వాత వెంటనే మా నాన్నని గట్టిగా హగ్ చేసుకోవాలని అనిపించింది. తండ్రి కొడుకుల రిలేషన్‌షిప్‌ని బొమ్మరిల్లు సినిమాల్లో చూశారు. ఆ సినిమా నాకు చాలా నేర్పించింది. అలాంటి సినిమా తర్వాత మళ్ళీ తండ్రి కొడుకుల రిలేషన్‌షిప్ 3 బీహెచ్‌కే లో చూస్తారు.”

“ఈ సినిమా చూసినప్పుడు నాకు ఎలాంటి అనుభూతి కలిగిందో మీకు కూడా ఆ అనుభూతి కలుగుతుందని భావిస్తున్నాను. మీ ఫ్యామిలీని తీసుకుని థియేటర్స్‌కి వెళ్ళండి. వాళ్ళని హగ్ చేసుకోవడానికి మీ పక్కనే ఉంటారు. శ్రీ గణేష్ ఎక్స్ట్రార్డినరీ రైటర్ డైరెక్టర్. తను ఈ కథ చెప్పినప్పుడే చాలా ఎమోషనల్‌గా అనిపించింది. సొంత ఇల్లు అందరి కల. నేను కూడా చిన్నప్పుడు మా సొంతిల్లు కోసం ఎదురు చూశాను. మనందరం అలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచే వచ్చాము.”

“ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఇల్లు. అందులో మెయిన్ క్యారెక్టర్స్ శరత్ కుమార్ గారు, దేవయాని గారు. వాళ్లు ఈ సినిమాలో నటించడం మర్చిపోలేని అదృష్టం. ఇది నా 40వ సినిమా. అలాంటి సినిమాలో ఇంత మంచి యాక్టర్స్ ఉండటం నా అదృష్టం. నా వాల్యూని తెలుగు ప్రేక్షకులే మొదటి చూశారు. ఎప్పుడు కూడా వారే గొప్ప ప్రేమని చూపించారు. అది ఎప్పటికి మారదు. మారకూడదు.”

“ఇది ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ స్టోరీ. మీకు ట్రైలర్ నచ్చితే ఖచ్చితంగా వెళ్ళండి. చాలా ప్రేమతో ఈ సినిమా తీశాం. చైత్ర, మిత్ర అందరూ మీ ఆశీర్వాదం కోసం ఎదురుచూస్తున్నారు. ఒక హానెస్ట్ ఫ్యామిలీ ఫిలిం తీయడం చాలా కష్టం. అలాంటి మంచి సినిమా ఇది. మంచి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. ఇందులో మంచి హోప్ ఉంది. థియేటర్ నుంచి బయటికి వెళ్లేటప్పుడు ఒక పాజిటివ్ హోప్ తో వెళ్తారు.”

“ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ థాంక్యూ. ప్రొడ్యూసర్ అరుణ్ ఇప్పుడు ఉంటున్న ఇల్లు గతంలో కళాతపస్వి కె విశ్వనాథ్ గారు ఉండేవారు. ఈ సినిమాని కళాతపస్వి కె.విశ్వనాథ్ గారికి అంకితం చేస్తున్నాం. సినిమాని రిలీజ్ చేస్తున్న మైత్రి డిస్ట్రిబ్యూషన్ వారికి ధన్యవాదాలు. ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్. ఇల్లు అనేది ఒక డ్రీమ్. అలాంటి ఎమోషన్స్‌ని ఈ సినిమా మీ అందరికీ ఇస్తుంది. జూలై 4న తప్పకుండా మీరందరూ ఆ ఎమోషన్‌ని ఎక్స్‌పీరియన్స్‌ చేస్తారు. మీ అందరి ప్రేమకి థాంక్యూ” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.