3 BHK ట్రైలర్.. మధ్యతరగతి భావోద్వేగ ప్రయాణం

Siddharth's 3 BHK Trailer Released

హీరో సిద్ధార్థ్ 40వ మూవీ ‘3 BHK’. శ్రీ గణేష్ దర్శకత్వం వహించారు. పోస్టర్లు, టీజర్లు, పాటలతో సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది. ప్రముఖ నటుడు శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తుండగా, దేవయాని, యోగి బాబు, మీతా రఘునాథ్, చైత్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ నిర్మించిన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ తాజాగా విడుదలైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇల్లు సొంతం చేసుకోవాలనే జీవితకాల కల కలిగిన మధ్యతరగతి కుటుంబ భావోద్వేగ ప్రయాణంలో ఈ ట్రైలర్ మనసుని హత్తుకుంది. జీవితంలో వైఫల్యాలు, నిరాశలను ఎదుర్కొన్న తండ్రి, కుటుంబం ఆకాంక్షలను నెరవేర్చడానికి తన కొడుకుపై తన ఆశలన్నింటినీ ఉంచుతాడు. అయితే, చదువు పరంగా కష్టపడుతూ, అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ 34 సంవత్సరాల వయస్సులో కూడా ఉద్యోగం లేకుండా ఉన్న కొడుకు భావోద్వేగ ప్రయాణం చాలా ఎమోషనల్ గా వుంది.

ఆ కుటుంబం కల చివరకు సాకారం అవుతుందా లేదా అనేది చాలా ఆసక్తిని పెంచింది. ఇల్లు కొనడం అనేది మధ్యతరగతి కుటుంబాల కల. ఈ కథ అందరికీ కనెక్ట్ అయ్యేలా వుంది. దర్శకుడు శ్రీ గణేష్ భావోద్వేగపరంగా హృదయాన్ని తాకే కథనంతో తన మ్యాజిక్ ని ప్రజెంట్ చేశాడు.

సిద్ధార్థ్ తన పాత్రలో ఒదిగిపోయాడు. తన పెర్ఫార్మెన్స్ అద్భుతంగా వుంది. తన కుటుంబం ఆనందం, భద్రత గురించి మాత్రమే కలలు కనే ఒక సాధారణ మధ్యతరగతి తండ్రి పాత్రను శరత్ కుమార్ చాలా చక్కగా పోషించారు. కథకు భావోద్వేగాన్ని జోడించే ఆకట్టుకునే నటనతో దేవయాని, మీతా రఘునాథ్ , చైత్ర ఆకట్టుకున్నారు.

సినిమాటోగ్రాఫర్లు దినేష్ కృష్ణన్ బి, జితిన్ స్టానిస్లాస్ విజువల్స్ మధ్యతరగతి జీవితాన్ని అందంగా చూపించాయి. ప్రతి ఫ్రేమ్‌ నేచురల్ గా వుంది. అమృత్ రామ్‌నాథ్ నేపథ్య సంగీతం ఎమోషన్ ని మరింత పెంచుతుంది. నిర్మాణ విలువలు టాప్ క్యాలిటీలో వున్నాయి.

గణేష్ శివ రాసిన స్క్రీన్ ప్లే, రాకేందు మౌళి సంభాషణలు అద్భుతంగా వున్నాయి. వినోద్ రాజ్ కుమార్ ఎన్ ఆర్ట్ డైరెక్టర్. ఆర్. సిబి మారప్పన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్. ట్రైలర్ సినిమాపై అంచనాలని పెంచింది. జూలై 4న ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.