దర్శక ధీరుడు రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ ఉంది. ఇండియాలోనే కాకుండా బయట చాలాదేశాల్లో ఆయనకు అభిమానులున్నారు. దీంతో ఆయనకు సంబంధించిన ఏ న్యూస్ అయినా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. తాజాగా అలాంటిదే రాజమౌళి వీడియో ఒకటి ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. అదేంటంటే, ఆయన ఒక ఇంటర్నేషనల్ వీడియో గేమ్‌లో కనిపించారు. వివరాల్లోకి వెళ్తే..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జపాన్‌కు చెందిన లెజెండరీ గేమ్ క్రియేటర్ హిడియో కొజిమా రూపొందించిన ‘డెత్ స్ట్రాండింగ్ 2’ అనే ఈ గేమ్‌లో రాజమౌళి క్యామియో రోల్ పోషించారు. ఆయన తనయుడు కార్తికేయ కూడా ఇందులో గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చారు. అయితే ఈ వీడియో గేమ్‌లో రాజమౌళి ది అడ్వెంచర్‌గా, కార్తికేయ ది అడ్వెంచర్ సన్ పాత్రలో నటించారు. ఇక ఇటీవలే ఆ వీడియో గేమ్ రిలీజవగా.. తాజాగా దీనికి సంబంధించిన విజువల్స్, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
కాగా ఇటీవల రాజమౌళి, కార్తికేయ జపాన్‌లో హిదేవు కొజిమతో వీడియో కాల్ మాట్లాడిన ఫోటో వైరల్‌గా మారిన సంగతి గుర్తుండేవుంటుంది. గతంలోనే జపాన్‌కి వెళ్ళినపుడు ఈ వీడియో గేమ్ లో భాగమయ్యేందుకు అంగీకరించిన రాజమౌళి, అందుకు సంబంధించిన షూట్ కూడా పూర్తిచేసుకొని వచ్చినట్టు తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
కాగా స్టార్ వీడియో గేమ్ డిజైనర్, రైటర్, డైరెక్టర్, నిర్మాత అయిన హిదేవు కొజిమ రూపొందించిన ఈ వీడియో గేమ్‌లో ఇప్పటికే హాలీవుడ్ స్టార్స్ నార్మన్ రీడస్, ఎల్లీ ఫానింగ్, లియా సెడాక్స్లాంటి టాలెంట్స్ నటించారు. ఇప్పుడు వాళ్ల సరసన మన రాజమౌళి, కార్తికేయ కూడా క్యామియోగా భాగమవడం గమనార్హం.
ఇక రాజమౌళికి తొలినుంచీ జపాన్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. ‘ఈగ, బాహుబలి 1 &2, ఆర్ఆర్ఆర్’ సినిమాలకు అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాలతో జపాన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని టెక్నిషియన్స్ కూడా రాజమౌళికి ఫిదా అయ్యారు. అప్పటినుంచీ ఆయనకు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.
ఇదిలావుంటే మరోవైపు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ పాన్ ఇండియా సినిమాలు చేసిన ఈయన.. ఈ చిత్రంతో పాన్ వరల్డ్ స్థాయిలో సత్తా చూపబోతున్నారు. ఈ నేపథ్యంలో జపాన్‌కి చెందిన వీడియో గేమర్ రూపొందించిన ఈ క్లాసిక్ లెవెల్ గేమ్‌తో రాజమౌళి క్రేజ్ మరింతగా పెరగనుంది. ఇది రేపు మహేష్ సినిమాకి బాగా కలిసొస్తుందని సూపర్ స్టార్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























