మైత్రి చేతికి కన్నప్ప

kannappa nizam and ceded theatrical rights bagged by Mythri Movie Distributors LLP

మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది. రెబల్ స్టార్ ప్రభాస్ ,మోహన్ లాల్ , అక్షయ్ కుమార్ వంటి స్టార్లు ఇందులో నటించడంతో అంచనాలు భారీగా వున్నాయి.గత కొన్ని రోజుల నుండి ప్రమోషన్స్ కూడా భారీగానే చేస్తున్నారు.వరుసగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లను నిర్వహిస్తూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్తున్నారు.ఇక ఈసినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరుగుతుంది.అన్ని భాషల్లో పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్లు ఈసినిమా థియేట్రికల్ హక్కులను తీసుకున్నారు.అందులో భాగంగా నైజాం అలాగే సీడెడ్ లో ఈసినిమా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదలవుతుంది.దాంతో పెద్ద సంఖ్యలో థియేటర్లు దొరకనున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ వచ్చింది.హిట్ టాక్ వస్తే చాలు ఈసినిమా భారీ వసూళ్లను సొంతం చేసుకోనుంది.ఇక ఈసినిమా భారీ రన్ టైంతో ప్రేక్షకులముందుకు రానుంది.దాదాపు 3 గంటల 15 నిమిషాల రన్ టైంతో రానుంది.ప్రభాస్ ఇందులో దాదాపు 40 నిమిషాలు కనిపించనున్నాడట. ఈసినిమా కోసం మంచు విష్ణు భారీగా ఖర్చు చేశాడు.మరి కన్నప్ప ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

శివుడి భక్తుడు కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించిన ఈసినిమాలో కన్నప్పగా మంచు విష్ణు నటించగా మోహన్ బాబు ,ప్రభాస్ ,మోహన్ లాల్ ,అక్షయ్ కుమార్, కాజల్ కీలక పాత్రల్లో నటించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.