కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న లేటెస్ట్ యునినామస్ బ్లాక్ బస్టర్ శేఖర్ కమ్ముల ‘కుబేర’. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మించారు. ఈ నేపథ్యంలో జూన్ 20న కుబేర తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే మార్నింగ్ షో నుంచే యునానిమస్ పాజిటివ్ టాక్‌తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని హౌస్ ఫుల్ బుకింగ్స్‌తో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ తాజాగా ఆదివారం బ్లాక్ బస్టర్ కుబేర సక్సెస్ మీట్ నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరుగగా.. సినిమా యూనిట్ అంతా హాజరై సందడి చేసింది.
ఈ సందర్భంగా కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. మై బ్రదర్ పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి థాంక్యూ. ఇండస్ట్రీ అంతా చిరంజీవి గారిని ఎంతగానో ప్రేమిస్తుంది. ‘విక్రమ్’ సినిమా పెద్ద హిట్ అయినప్పుడు కమల్ గారు ఇక్కడికి వచ్చారు. ఆయన్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టి పంపించారు. అమీర్ ఖాన్ గారు హిందీ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన సినిమాని పక్కనుండి సపోర్ట్ చేశారు.”
“చిన్న సినిమా పెద్ద సినిమా ఏదైనా కావచ్చు.. సపోర్ట్ చేయడానికి చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. అందుకే ఆయన్ని అందరూ ఇష్టపడతారు, ప్రేమిస్తారు. ఆయన ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇది శేఖర్ కమ్ముల ఫిల్మ్. థ్రిల్లర్‌తో హ్యూమన్ ఎమోషన్‌తో సినిమా చేయడం అనేది మామూలు విషయం కాదు. అది ఈ సినిమాతో కుదిరింది.”
“ఈ సినిమాలో దీపక్, దేవా సమీరా ఇలా అన్ని పాత్రలే తప్పా స్టార్స్ కనిపించరు. ఈ సినిమా దేవ సినిమా.. దీపక్ సినిమా.. సమీరా సినిమా.. కుష్బూ సినిమా.. ఇట్స్ బిలాంగ్స్ టూ శేఖర్ కమ్ముల. ఆయనకి థాంక్యూ నాకు తెలియని యాక్టింగ్ ఏదో ఇందులో నేర్పించారు (నవ్వుతూ). నాకు ఈ సినిమా చేస్తున్నప్పుడు ప్రతిరోజు కొత్తగా ఉండేది. చిరంజీవి గారు వచ్చేటప్పుడు కార్‌లో చెప్పారు ‘చాలా బాగా చేశావు, దీపక్ అయిపోయావు’ అన్నారు.”
“అప్పుడు నాకు శేఖర్ కమ్ముల గొప్పతనం అర్థమైంది. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సునీల్ గారు నాకు బ్రదర్ లాంటివారు. రామ్మోహన్ గారు, జాన్వి అందరూ చాలా వెరీ స్వీట్ పర్సన్స్. నికిత్ అద్భుతమైన వర్క్ ఇచ్చారు. దేవిశ్రీ మ్యూజిక్ ఫెంటాస్టిక్. ఈ సినిమా మీడియాకు నచ్చింది. ఆడియన్స్ కి నచ్చింది. ఎక్కడ కూడా 3 రేటింగ్ కంటే తక్కువ ఇవ్వలేదు. ఇది చాలా అరుదుగా జరుగుతుంది.”
“ఇలాంటి మిరాకిల్‌ని శేఖర్ క్రియేట్ చేశాడు. ధనుష్‌ని సెట్‌లో అసలు పోల్చుకోలేకపోయా. సినిమా అంతా దేవా క్యారెక్టర్ లోనే ఉన్నారు. అలా ఉండడం అంత ఈజీ కాదు. రష్మికని చూస్తే ‘క్షణక్షణం’లో శ్రీదేవి గారి గుర్తుకొచ్చారు. ఈ సినిమాలో తను చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఈ సినిమా తనలోని వరల్డ్‌ని ఓపెన్ చేసింది. మరో 40 ఏళ్ళు తిరుగుండదు. ఐ లవ్ యూ ఆల్” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























