బాక్సాఫీస్ వద్ద కుబేర రాంపేజ్ స్టార్ట్ అయ్యింది.నిన్న ఈసినిమా మంచి అంచనాల మధ్య రిలీజ్ అవ్వగా పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుంది.దాంతో మొదటి రోజు ఊహించని రీతిలో వసూళ్లను రాబట్టింది.ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ,తమిళంలో కలిపి 30కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.అలాగే ఈసినిమా ధనుష్, నాగార్జున కు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ను అందించింది.ధనుష్, సార్ తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 2.06కోట్ల షేర్ నురాబట్టగా కుబేర కేవలం నైజాం లోనే ఆ మార్క్ ను క్రాస్ చేసింది.అటు ఓవర్సీస్ లోకూడా ఈసినిమా అదరగొడుతుంది.యూఎస్ లో 1 మిలియన్ డాలర్ మార్క్ ను దాటేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రెండో రోజు కూడా కుబేర జోరు కొనసాగిస్తోంది.ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద వేరే సినిమాలతో పోటీ లేకపోవడంతో కుబేర సాలిడ్ హోల్డ్ ను కొనసాగిస్తోంది. ఇప్పటివరకు బుక్ మై షోలో 5 లక్షలకు పైగా టికెట్స్ తెగాయి.ఈరోజు గంటకు 15 వేలకుపైగా టికెట్ బుకింగ్స్ తో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.రెండో రోజు ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 15 కోట్ల వరకు వసూళ్లను రాబట్టుకోనుంది.ఈరోజుతో 50కోట్ల క్లబ్ లో చేరనుంది.వచ్చే వారంలో బ్రేక్ ఈవెన్ ను కూడా క్రాస్ చేయనుంది.
ధనుష్ ,నాగార్జున ,రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈసినిమాను శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేయగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.సునీల్ నారంగ్ , పుస్కూర్ రామ్ మోహన్ నిర్మించారు.ఇక గత కొన్ని నెలల నుండి సరైన సినిమాలు లేక వెలవెలబోయిన టాలీవుడ్ బాక్సాఫీస్ కుబేర వల్ల మళ్ళీ కళ కళలాడుతుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























