2013 ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సెన్సేషన్ సృష్టించింది మలయాళ సినిమా దృశ్యం. సూపర్ స్టార్ మోహన్ లాల్ దర్శకుడు జీతూ జోసఫ్ కాంబినేషన్ లో వచ్చిన ఈసినిమా క్రైం థ్రిల్లర్ డ్రామాల్లో బెంచ్ మార్క్ ను క్రియేట్ చేసింది.ఆ తరువాత దృశ్యం తెలుగు ,హిందీల్లో రీమేక్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఈసినిమాకు సీక్వెల్ గా వచ్చిన దృశ్యం 2 కూడా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.అయితే కోవిడ్ వల్ల ఈసినిమా థియేటర్లలో రిలీజ్ అవ్వలేదు. తెలుగులోనూ డైరెక్ట్ గా, ఓటీటీలోనే రిలీజై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. హిందీలో మాత్రం థియేట్రికల్ రిలీజ్ కాగా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సిరీస్ లో థర్డ్ పార్ట్ కూడా రానుంది.అందులో భాగంగా ప్రస్తుతం దృశ్యం 3 స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది.అక్టోబర్ లో షూటింగ్ మొదలు పెట్టనున్నామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.అయితే హిందీలో ఆల్రెడీ దృశ్యం 3 అనౌన్స్ చేసి అక్టోబర్ 2న రిలీజ్ కానుందని డేట్ కూడా చెప్పేశారు.దాంతో ఈసినిమా వేరే కథ తో రానుందని వార్తలు వచ్చాయి.ఇక దీనిపై డైరెక్టర్ జీతూ జోసెఫ్ క్లారిటీ ఇచ్చాడు.
హిందీ దృశ్యం 3 కూడా నా కథ తోనే తెరకెక్కుతుంది.మలయాళం తోపాటు తెలుగు ,హిందీల్లో ఒకేసారి విడుదలచేసేలా ప్లాన్ చేస్తున్నామని అన్నారు.అయితే తెలుగులో దృశ్యం 3 వెంకటేష్ చేస్తాడా లేక మలయాళ వెర్షన్ నే రిలీజ్ చేస్తారనేది త్వరలోనే క్లారిటీ రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: