నానిని క‌లిసిన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ డైరెక్టర్

Tourist Family Director Abishan Jeevinth Meets Hero Nani

కోలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ డైరెక్టర్ అభిషన్ జీవింత్ ఈ సినిమాతో దేశవ్యాప్తంగా ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు. కేవ‌లం రూ. 8 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన టూరిస్ట్ ఫ్యామిలీ దాదాపు రూ.90 కోట్ల వ‌సూళ్ల‌ను అందుకుని సెన్సేషన్ సృష్టించింది. ప్ర‌స్తుతం ఈ మూవీ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతూ నేషనల్ వైడ్‌గా మంచి ఆదరణ దక్కించుకుంటోంది. ఇదిలావుంటే తాజాగా ఈ డైరెక్టర్ టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నానిని క‌లుసుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అంతకుముందు నాని ఈ సినిమాను వీక్షించి ఎక్స్ వేదికగా మెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ యంగ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ హీరో నానిని కలిసి కృతజ్ఞతలు చెప్పాడు. ఈ మేరకు అభిషన్ ఎక్స్ వేదిక‌గా.. “ఎంతటి అద్భుతమైన రోజు! నాని సార్, మిమ్మల్ని కలవడం నిజంగా గౌరవంగా భావిస్తున్నాను. మీరు చాలా వినయపూర్వకమైన మరియు దృఢమైన వ్యక్తి. మీరు సినిమా గురించి ఇంత వివరంగా చెప్పిన విధానం నాకు సినిమాను మరింత ప్రత్యేకంగా చేసింది. ధన్యవాదాలు” అని పేర్కొన్నాడు.

కాగా ఈ చిత్రంలో శశికుమార్, సిమ్రాన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించగా.. యోగి బాబు, మిథున్ జై శంకర్, కమలేష్ జెగన్, ఎం.ఎస్. భాస్కర్, రమేష్ తిలక్, భగవతి పెరుమాళ్ తదిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. మే 1న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ మూవీ సూప‌ర్ హిట్‌ను అందుకుంది. ప్రేక్ష‌కులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. అలాగే ఇండస్ట్రీ తరపున సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, సూర్య, ధ‌నుష్, శివ‌కార్తికేయ‌న్‌ తదితరులు సినిమాపై ప్ర‌శంస‌లు కురిపించారు. ఇంకా ఎస్.ఎస్ రాజ‌మౌళి సైతం దీనిని మెచ్చుకున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.