మ్యాడ్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది మలయాళ బ్యూటీ అనంతిక సనిల్ కుమార్.ఇక ఈసినిమా తరువాత అనంతిక లీడ్ రోల్ లో 8 వసంతాలు చేసింది.ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ చిత్రం జూన్ 20న వరల్డ్ వైడ్ విడుదల కానుంది.ఈ సందర్భంగా హీరోయిన్ అనంతిక సనీల్‌కుమార్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా ప్రమోషన్స్ మెటీరియల్ చూస్తుంటే ఈ కథంతా మీ చుట్టూనే ఉంటుందనిపిస్తుంది?
ఇది విమెన్ కి సంబంధించిన కథ. కథలో అమ్మాయి పాత్ర కీలకం అయినప్పటికీ మిగతా పాత్రలన్నిటికీ సమానంగా ప్రాముఖ్యత వుంది. ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్. ప్రతి క్యారెక్టర్ కి లేయర్స్ ఉంటాయి.
మ్యాడ్ తర్వాత ఈ సినిమాని ఎంచుకోవడానికి కారణం?
మంచి కథ కోసం వెయిట్ చేశాను. ఈ కథలో నేను కోరుకున్న ప్రతిదీ ఉంది. నాకు యాక్షన్, బ్యూటిఫుల్ లవ్ స్టొరీ చేయాలని ఉండేది. అవన్నీ కూడా ఈ కథలోనే కుదిరాయి. ఫర్ఫార్మెన్స్ చేయడానికి చాలా మంచి స్కోప్ ఉండే క్యారెక్టర్. కథ చదివినప్పుడు చాలా కనెక్ట్ అయ్యాను. లిటరల్ గా ఏడ్చేశాను. అంత ఎమోషనల్ చెప్తున్న కథ ఇది. నేను శుద్ధి యోగ్య పాత్రలో కనిపిస్తాను. తను ఒక రచయిత అలాగే తనకి మార్షల్ ఆర్ట్స్ నేపథ్యం కూడా ఉంటుంది.
ఈ ప్రేమ కథలో ప్రత్యేకత ఏమిటి ?
చాలా ప్యూర్ లవ్ స్టోరీ ఇది. రియల్ ఒక జీవితాన్ని చూస్తున్న అనుభూతి కలుగుతుంది. అన్ని ఏజ్ గ్రూప్స్ కి రిలేట్ అవుతుంది.
ఈ సినిమా కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు?
నాకు బ్లాక్ బెల్ట్ వచ్చు. ఈ సినిమా కోసం కళరి ఫైట్ నేర్చుకున్నాను. అలాగే Wing Chun అనే చైనీస్ ఆర్ట్ ఫామ్ ని కూడా నేర్చుకున్నాను. దాని కోసం మూడు నెలలు అంజి మాస్టర్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను.
మిగతా నటీనటుల గురించి?
హను రెడ్డి వెరీ గుడ్ యాక్టర్ . చాలా ఫాస్ట్ గా నేర్చుకుంటారు. రవి కూడా చాలా మంచి యాక్టర్. ఎంత పెద్ద డైలాగ్ అయినా సులువుగా చెప్పగలరు.
డైరెక్టర్ ఫణీంద్ర గురించి?
ఫణీంద్ర గారు నాకు గురువు లాంటి వారు. ఈ జర్నీలో ఎన్నో విషయాలు ఆయన నుంచి నేర్చుకున్నాను. ఆయన క్లియర్ విజన్ తో ఉంటారు. చాలా పాషనేట్ ఫిలిం మేకర్. ఆయనతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్.
శుద్ధి అయోగ్య అనేది చాలా ఎమోషనల్ క్యారెక్టర్ కదా.. షూట్ తర్వాత ఎలా అనిపించింది?
ఇంటికి వచ్చిన తర్వాత అద్దం చూసుకుంటే చాలా మిస్సింగ్ ఫీలింగ్ అనిపిస్తుంది. ఆ క్యారెక్టర్, బిహేవియర్ అవన్నీ నాకు గుర్తుచ్చేవి. వెరీ మెమరబుల్ క్యారెక్టర్.
మైత్రి మూవీ మేకర్స్ గురించి ?
మైత్రి మూవీ మేకర్స్ తో వర్క్ చేయడం అద్భుతమైన ఎక్స్పీరియన్స్. నన్ను బిలీవ్ చేసి ఈ ప్రాజెక్టులో తీసుకున్నందుకు నిర్మాతలకు థాంక్స్ చెప్తున్నాను. ఈ జర్నీలో చాలా సపోర్ట్ చేశారు. ఇలాంటి సినిమాని తీయడానికి చాలా గట్స్ కావాలి.
మ్యూజిక్ గురించి?
హేషమ్ రెండు బ్యూటీఫుల్ సాంగ్స్ ఇచ్చారు. రెండు పాటలు ఆడియన్స్ కి చాలా నచ్చాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంటుంది.
మీరు యాక్టర్ కాకపోయినా ఇంకేం అయ్యేవారు?
పొలిటీషియన్ అవ్వాలని ఉంది నా కోరిక. అందుకే లా చదువుతున్నాను. అయితే అది ఇప్పుడు కాదు నాకు ఒక 40 ఏళ్ళు వచ్చిన తర్వాత(నవ్వుతూ)
మీకు డ్రీమ్ రోల్స్ ఉన్నాయా?
పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్ రోల్స్ చేయడానికి ఇష్టపడతాను.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























