పుష్ప 2 తో సెన్సేషన్ సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ ని కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో చేయనున్నాడని తెలిసిందే.ఈ ప్రాజెక్ట్ ను AA 22 x A 6 గా పిలుస్తున్నారు.ఇక ఈసినిమా షూటింగ్ రేపటి నుండి ముంబై లో జరగనుందని సమాచారం.విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉండడంతో షూటింగ్ ఆలస్యంగా పూర్తి కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రీసెంట్ గా ఈసినిమాలో హీరోయిన్ ఎవరనేది రివీల్ చేశారు.ఇందులో బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపిక పదుకొనె ఓ హీరోయిన్ గా తీసుకున్నారు.తనకు తెలుగులో ఇది రెండో సినిమా.ఇంతకుముందు కల్కి 2898 ఏడి ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.ఈసినిమా 1000కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఇక ఇప్పుడు AA 22 x A 6 లోకూడా నటించనుంది.కేవలం అనౌన్స్ మెంట్ వీడియో లతో సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు మేకర్స్ .
దాదాపు 600కోట్ల బడ్జెట్ తో సన్ పిక్చర్స్ ఈసినిమాను నిర్మిస్తుండగా మ్యూజిక్ డైరెక్టర్ ను ఖరారు చేయాల్సివుంది.అట్లీ ఈసినిమాను హాలీవుడ్ మూవీ లెవెల్లో తెరకెక్కించనున్నాడు.వచ్చే ఏడాదిలోగా షూటింగ్ ను కంప్లీట్ చేసి 2027 లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























