మ్యాడ్ ఫేమ్ అనంతిక సనీల్‌కుమార్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా 8 వసంతాలు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం లో మను ఫేమ్ ఫణీంద్ర నర్సెట్టి ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.ఇప్పటివరకు రెండు టీజర్ లు ,ఒక సాంగ్ రిలీజ్ కాగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈరోజు సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేశారు.పరిచయమిలా అంటూ సాగే ఈ సాంగ్ ను ప్రముఖ గాయని చిత్ర పాడగా వనమాలి సాహిత్యం అందించారు.ఈ సాంగ్ ఆకట్టుకుంది. అందమైన ప్రేమ కథా చిత్రం గా తెరకెక్కుతున్న ఈసినిమాలో హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల,సంజన, కన్నా,స్వరాజ్ రెబ్బాప్రగడ, సమీరా కిషోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.హెషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు.ఈనెల 20న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
అయితే అదే రోజు ధనుష్ ,నాగార్జున ల కుబేర కూడా రిలీజ్ కానుంది. ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న ఈసినిమాకు భారీ హైప్ వుంది.దాంతో బాక్సాఫీస్ వద్ద 8 వసంతాలు భారీ ఎదుర్కోవాల్సి ఉంటుంది.మరి ఈ పోటీని తట్టుకొని 8 వసంతాలు ఎలాంటి రన్ ను కొనసాగిస్తుందో చూడాలి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























