హరిహర వీరమల్లు.. వీఎఫ్ఎక్స్ నెక్స్ట్ లెవెల్లో

Hari Hara Veera Mallu Al-Zahra Studio Presents Mind Blowing Visuals Like Never Before

తెలుగు ప్రేక్షకులు ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ‘హరిహర వీరమల్లు’ ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ హిస్టారికాల్ యాక్షన్ డ్రామాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. బాబీ డియోల్, జిషు సేన్‌గుప్తా, నాజర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. త్వరలోనే థియేటర్లలోకి రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎంఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ అడ్రినలిన్-చార్జ్డ్ రైడ్‌ బుక్ మై షో లో ఇప్పటికే 200K పైగా ఇంట్రెస్ట్స్ అధిగమించింది. ఇదిలావుంటే, మరోవైపు ఈ చిత్రం తాజాగా వీఎఫ్ఎక్స్ పనులను పూర్తిచేసుకుంది. వీఎఫ్ఎక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్, ఈ సినిమాకి పనిచేసిన వీఎఫ్ఎక్స్ టీమ్ ఫోటోను పంచుకుంది. గత రెండేళ్లుగా వీరు అహరహం శ్రమించినట్టు తెలిపింది.

ఈ మేరకు ఎక్స్ వేదికగా.. “హరిహర వీరమల్లు కోసం అల్-జహ్రా స్టూడియో చాలా కష్టపడింది. అద్భుతమైన విజువల్స్‌ అందించడానికి 2 సంవత్సరాలకు పైగా వీరు అంకితభావంతో పనిచేశారు. ప్రతి ఫ్రేమ్ సినిమాటిక్ ఆశయానికి నిదర్శనంగా నిలుస్తుంది. డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఆధ్వర్యంలో ఆయన విజనరీకి తగ్గట్టుగా మునుపెన్నడూ లేని విధంగా VFX ని చూడటానికి సిద్ధంగా ఉండండి!” అని పేర్కొంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.