మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి హిందీ సినిమా ‘వార్ 2’. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్తో కలిసి ఆయన స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 14న థియేటర్లలో విడుదలకానుంది. ఇటీవల ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా చిత్ర యూనిట్ వార్ 2 టీజర్‌ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది. తాజాగా ఎన్టీఆర్ డబ్బింగ్ స్టార్ట్ చేశారు. తన పాత్రకు ఆయనే స్వయంగా డబ్బింగ్ చెబుతుండటం గమనార్హం. ఇంతకుముందు ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం హిందీ వెర్షన్‌కి కూడా ఎన్టీఆరే డబ్బింగ్ చెప్పుకున్నారు.
ఇదిలావుంటే, ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ నటించిన మొదటి బాలీవుడ్ ఫిల్మ్ కావడంతో ఇటు టాలీవుడ్ సహా అటు హిందీ చిత్ర పరిశ్రమలోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికితోడు హృతిక్ రోషన్ ఉండటంతో ఇరువురి అభిమానులతోపాటుగా మూవీ లవర్స్ కూడా దీనిపై ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో వార్ 2 తెలుగు రైట్స్ కోసం భారీ పోటీ నెలకొంది. అందుకే యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాతలే వరల్డ్ వైడ్‌గా సొంతంగా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
అయితే వార్ 2కి బాక్సాఫీస్ వద్ద ‘కూలీ’ రూపంలో గట్టి పోటీ ఎదురుకానుంది. సూపర్ స్టార్ రజినీకాంత్, క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా కూడా ఆగస్టు 14నే విడుదలకానుండటం తెలిసిందే. ఇక ఈ మూవీలో కింగ్ నాగార్జున కూడా నటిస్తుండడంతో తమిళంలోనే కాకుండా తెలుగులోనూ భారీ అంచనాలు వున్నాయి. ఉపేంద్ర,శృతి హాసన్ కీలక పాత్రలు పోషిస్తుండగా.. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























