బాలకృష్ణ బర్త్ డే.. పవన్ కళ్యాణ్ సహా సినీ ప్రముఖుల విషెస్

Nandamuri Balakrishna Birth Day Pawan Kalyan and Many Celebs Extends Wishes

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నారు. విశ్వ విఖ్యాత న‌ట‌సార్వభౌమ నంద‌మూరి తార‌క‌ రామారావు నట వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన బాలయ్య.. ఆ తరువాత తన సొంత ప్రతిభతో అత్యున్నత స్థాయికి ఎదిగారు. 1974లో ‘తాతమ్మ కల’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెరంగేట్రం చేసిన ఆయన ఇటీవలే చిత్ర ప‌రిశ్ర‌మ‌లో 50 ఏళ్ళు పూర్తిచేసుకున్నారు. ఈ క్రమంలో 100కి పైగా సినిమాలలో నటించి తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిలో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం ఆయన తన తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీ తరపున హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మరోవైపు తన మాతృమూర్తి పేరుమీద నెలకొల్పిన బసవతారకం ఇండో అమెరికన్ ఆసుపత్రికి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక నేడు 65వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా బాలకృష్ణకు ఆయన అభిమానులు, పలువురు సినీ,రాజకీయ ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. అలాగే సోషల్ మీడియా వేదికగా అనేకమంది నెటిజెన్లు ఆయనకు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు.

ఇక బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రముఖులలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బాలకృష్ణ అల్లుడు, ఏపీ మంత్రి నారా లోకేష్, బాలయ్య కుమార్తెలు బ్రాహ్మణి, తేజస్విని, హీరోలు నందమూరి కళ్యాణ్ రామ్, నారా రోహిత్.. డైరెక్టర్స్ బాబీ, అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీనివాస్, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమన్ సహా పలువురు ప్రముఖులు ఉన్నారు. అలాగే టాప్ ప్రొడక్షన్ హౌజ్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సహా ఇతర నిర్మాణ సంస్థలు బాలయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.