అఖండ 2: తాండవం టీజర్‌లో ఇవి గమనించారా..?

Akhanda 2 - Thaandavam Teaser Highlights

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను హైలీ యాంటిసిపేటెడ్ ‘అఖండ 2: తాండవం’ కోసం నాల్గవ సారి కొలాబరేట్ అయ్యారు. ప్రతిష్టాత్మకమైన 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం, ఈ సినిమాను జార్జియాలోని గ్రాండ్ లొకేషన్స్‌లో చిత్రీకరిస్తున్నారు. అక్కడ అద్భుత సన్నివేశాలని షూట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ పుట్టినరోజు (జూన్ 10)ను పురస్కరించుకొని మేకర్స్ ఒకరోజు ముందు ‘అఖండ 2: తాండవం’ సెన్సేషనల్ టీజర్‌ని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. టీజర్ అయితే అదిరిపోయింది. ఈ టీజర్ తో బాలయ్యకు బెస్ట్ బర్త్ డే గిఫ్ట్ అందించింది అఖండ 2 టీం.

‘అఖండ 2: తాండవం’ టీజర్ హైలైట్స్..

  • ఈ టీజర్‌లో అద్భుతమైన ఎలిమెంట్ ఫెరోషియస్, డివైన్‌తో కూడిన బాలకృష్ణ సెన్సేషనల్ లుక్. ఇది పాత్రకు పర్ఫెక్ట్ యాప్ట్ అయ్యింది.
  • బాలకృష్ణను అందరికంటే అద్భుతంగా ప్రెజంట్ చేయగలరని బోయపాటి మరోసారి నిరూపించారు.
  • టీజర్‌లో త్రిశూలం నంది, మంచుతో కప్పబడిన కైలాసం నేపథ్యం మెస్మరైజ్ చేశాయి.
  • ఇది పాత్ర వెనుక ఉన్న రీసెర్చ్, సినిమా ఇతివృత్తాన్ని ప్రజెంట్ చేశాయి.
  • బాలకృష్ణ ఫెరోషియస్ యాక్షన్ గూస్ బంప్స్ తెప్పించింది.
  • ‘నా శివుడి అనుమతి లేనిదే ఆ యముడైనా కన్నెత్తి చూడడు. నువ్వు చూస్తావా.. అమాయకుల ప్రాణాలు తీస్తావా’ అంటూ అఘోర పాత్రలో బాలయ్య చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ మెస్మరైజ్ చేసింది.
  • రౌడీలని పక్కకు విసిరే సన్నివేశాలు, త్రిశూలం షాట్ మైండ్ బ్లోయింగ్‌గా వున్నాయి.
  • ‘వేదం చదివిన శరభం యుద్ధానికి దిగింది..’ అనే సంభాషణతో ముగిసిన టీజర్‌ మరింత కిక్ ఇచ్చింది.
  • యాక్షన్ కొరియోగ్రాఫర్లు రామ్-లక్ష్మణ్ బాలకృష్ణ మాస్ అప్పీల్‌ను అద్భుతంగా ప్రజెంట్ చేశారు.
  • బాలకృష్ణ చెప్పిన డైలాగులు పవర్ ఫుల్‌గా అద్భుతంగా వున్నాయి.
  • థమన్ నేపథ్య సంగీతం నెక్స్ట్ లెవెల్‌లో వుంది.
  • బాలకృష్ణ చిత్రానికి సంగీతం అందించే విషయంలో థమన్ కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్‌లో చేస్తారని మరోసారి రుజువైయింది.
  • 14 రీల్స్ ప్లస్ నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్‌ చాలా గ్రాండియర్‌గా వుంది.

మొత్తానికి టీజర్ అయితే గూస్ బంప్స్ తెప్పించింది. సినిమాపై అంచనాలని భారీగా పెంచింది. ఈ హై-ఆక్టేన్ సీక్వెల్ కథ, స్కేల్, నిర్మాణం, సాంకేతిక నైపుణ్యం.. ప్రతి అంశంలో అఖండను మించి ఉంటుదని హామీ ఇస్తోంది. సెప్టెంబర్ 25న దసరా స్పెషల్‌గా థియేటర్లలో ఈ సినిమా తాండవం చేస్తుందని మేకర్స్ తెలియజేశారు. ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.

ఇక ఈ చిత్రంలో సంయుక్త హీరోయిన్‌గా నటిస్తుండగా.. డైనమిక్ ఆది పినిశెట్టి ఇంటెన్స్ పాత్రని పోషిస్తున్నారు. టాప్ టెక్నికల్ టీం ఈ సినిమాకి పని చేస్తోంది. సంగీత సంచలనం S థమన్ సంగీతం సాంగ్స్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ C రాంప్రసాద్ డీవోపీగా పని చేస్తున్నారు. అలాగే తమ్మిరాజు ఎడిటర్‌గా, AS ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.