తమిళ స్టార్ హీరో సూర్య, టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్ లో సినిమా రానుందని తెలిసిందే.సూర్యకు ఇది 46వ సినిమా.రీసెంట్ గానే ఈ ప్రాజెక్ట్ లాంఛ్ కూడా అయ్యింది.ఇక ఈసినిమా ఈనెల 9 నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.ఈ సందర్భంగా ఈ రోజు పళని టెంపుల్ లో సూర్య ,వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఇక అందుకు సంబంధించిన స్టిల్ ను రిలీజ్ చేయగా ఇందులో సూర్య యంగ్ గా కనిపించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాలో ప్రేమలు ఫేమ్ మామితా బైజు హీరోయిన్ గా నటించనుండగా రవీనా టాండన్ ,రాధికా శరత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్నాయి.వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇక సూర్య ఈసినిమా కన్నా ముందు తన 45వ సినిమాతో ప్రేక్షకులముందుకు రానున్నాడు.షూటింగ్ కూడా ఆల్మోస్ట్ పూర్తి కావొచ్చింది.ప్రముఖ నటుడు ఆర్ జె బాలాజీ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా త్రిష కథానాయికగా నటిస్తుంది.యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మిస్తుంది.దీపావళికి రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























