గత కొన్నేళ్లుగా తెలుగు సహా పలు సౌత్ సినిమాలు హిందీలో సూపర్ హిట్ అవుతున్నాయి. దీంతో అక్కడి స్టార్స్ దక్షిణాది దర్శకులతో పనిచేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తమిళ్ డైరెక్టర్ అట్లీతో ‘జవాన్’ సినిమాను స్వయంగా నిర్మించి, నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇటీవలే ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్‌లో మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ‘సికిందర్’ చేశాడు. అంతకుముందు మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్‌తో ‘గజిని’ సినిమాను హిందీలో తీసి సూపర్ హిట్ అందుకున్నాడు మురుగదాస్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. అమీర్ ఖాన్ మరోసారి సౌత్ డైరెక్టర్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధమయ్యారు. ‘ఖైదీ, విక్రమ్, లియో’ వంటి చిత్రాలతో ఒక డిఫరెంట్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసిన కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌తో ఆయన త్వరలో ఓ సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం అమీర్ హీరోగా నటించిన ‘సితారే జమీన్ పర్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో లోకేశ్‌తో మూవీ గురించి రివీల్ చేశారు. ఈ మేరకు అమీర్ ఖాన్ స్వయంగా వేల్లడించారు. కాగా ఇది ఒక సూపర్ హీరో ఫిల్మ్ అని కూడా ఆయన తెలిపారు.
అయితే లోకేష్ ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్‌తో ‘కూలీ’ చిత్రం చేస్తున్నాడు. ఆగస్ట్ 14న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత ఆయన కార్తితో ఖైదీకి సీక్వెల్‌గా ‘ఖైదీ 2’ చేయబోతున్నాడు. ఈ మూవీ కంప్లీట్ చేశాక అమీర్ ప్రాజెక్టును చేపట్టనున్నాడు. ఇక ఈ న్యూస్ బయటికొచ్చాక దేశవ్యాప్యంగా దీనిపై విపరీతమైన ఆసక్తి నెలకొంది. కాగా మరోవైపు అమీర్ ఖాన్ తన డ్రీమ్ ప్రాజెక్టుగా ‘మహాభారతం’ బిగ్ స్కేల్‌తో ప్లాన్ చేస్తున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: