సినిమా అనేది కళాత్మకమైన వ్యాపారం. ఎవరు అవున్నానా, కాదన్నా.. ఇక్కడ సక్సెస్ ఒక్కటే కొలమానం. ఏదైనా ఒక మూవీ బాగా ఆడిందా? లేదా? మంచి బిజినెస్ చేసిందా? లేదా? అనేదానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. అయితే సినిమా అనేది సమిష్టి కృషి అనేది అందరికీ తెలిసిందే. ఒక చిత్రం విజయం సాధించినా, పరాజయం పాలైనా ఎఫెక్ట్ పడేది హీరో, దర్శకులపై మాత్రమే కాదు.. నిర్మాతపై కూడా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వాస్తవానికి నిర్మాత బాగుంటేనే, పరిశ్రమ బాగుంటుంది. ఏదైనా ఒక మూవీ ఫెయిల్ అయితే ఆ ప్రొడ్యూసర్ చాలా నష్టపోతాడు. సినిమా ఆడితే పర్లేదు, అదే ఏదయినా తేడా కొడితే మాత్రం నిర్మాతకి అది కోలుకోలేని దెబ్బే. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ చెల్లింపులు మాత్రం చేయాల్సిందే. ఇక ప్రస్తుత కాలంలో హీరోల రెమ్యూనరేషన్స్ కోట్లలో ఉంటున్నాయి.
అయితే చిత్ర రంగం ఎంత బిజినెస్ ఫీల్డ్ అయినా, నిర్మాతల గురించి ఆలోచించే హీరోలు కూడా ఉంటుంటారు. ఈ కోవకు చెందినవాడే ట్యాలెంటెడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ. చేసింది తక్కువ చిత్రాలే అయినా, తన యూనిక్ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ యంగ్ హీరో. ఇటీవల ఆయన నటించిన ‘జాక్’ మూవీ ఆశించిన మేరకు ఫలితం అందుకోలేకపోయింది.
దీంతో ఆయన చిత్ర నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్‌కి తన రెమ్యూనరేషన్‌లో సగం రూ. 4.75 కోట్లు తిరిగి ఇచ్చేశాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇది హాట్ టాపిక్ అయింది. సిద్దు పెద్ద మనసు చాటుకుని మిగతా హీరోలకు ఆదర్శంగా నిలిచాడని పలువురు కొనియాడుతున్నారు. కాగా ఇంతకుముందు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఇలాగే తన నిర్మాతలకు అండగా నిలిచినా ఉదంతాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు సిఐడి కూడా ఇదే బాటలో నడుస్తుండటం విశేషం. నిజంగానే ఇది హర్షించదగ్గ విషయం.
ఇక ఇదిలావుంటే, ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తెలుసుకదా’. నీరజా కోన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ఫిమేల్ లీడ్ రోల్స్ ప్లే చేస్తుండగా.. జ్ఞానశేఖర్ బాబా కెమెరా, ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























