గబ్బర్ సింగ్ తరువాత పవన్ కళ్యాణ్ ,హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్.2023 లోనే లాంఛ్ కాగా 20శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.అయితే ఆ తరువాత పవన్ పొలిటికల్ గా బిజీగా అవ్వడంతో ఇప్పటివరకు షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది.ఇక ఈసినిమా షూటింగ్ మళ్ళీ ప్రారంభం కానుంది.ఈనెల రెండో వారంలో కొత్త షెడ్యూల్ మొదలవ్వనుంది.ఈ విషయాన్ని స్వయంగా హరీష్ శంకరే వెల్లడించాడు.ఈరోజు తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ అప్డేట్ ఇచ్చాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈనెల 12నుండి ఈసినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుండగా ఫస్ట్ డే నే పవన్ ఈ షూట్ లో జాయిన్ కానున్నాడు.ఇందులో శ్రీ లీల ఓ హీరోయిన్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.ఈఏడాది షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఇదిలావుంటే ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.గత కొన్ని రోజుల నుండి ముంబై లో షూటింగ్ జరుపుకుంటుంది.సుజీత్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా ప్రియాంక మెహన్ హీరోయిన్ గా నటిస్తుంది.గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాలో ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.తమన్ సంగీతం అందిస్తున్నాడు.డివివి దానయ్య ఈసినిమాను నిర్మిస్తున్నారు.సెప్టెంబర్ 25న రిలీజ్ చేయనున్నారు.
ఇక పవన్ రీసెంట్ గా హరి హర వీరమల్లు షూటింగ్ పూర్తి చేశారు.ఈసినిమా విడుదలకు సిద్దమవుతుంది.పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో క్రిష్ ,జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేయగా ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు.భారీ బడ్జెట్ తో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























