బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నటించిన సినిమా భైరవం.చాలా గ్యాప్ తరువాత మనోజ్ నుండి వచ్చిన సినిమా ఇది. నిన్న ఈసినిమా రిలీజ్ కాగా పాజిటివ్ రివ్యూస్ సొంతం చేసుకుంది.దాంతో నిన్న ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో మంచు మనోజ్ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. భైరవం సినిమాకి గొప్ప విజయం ఇచ్చినందుకు ఆడియన్స్ కి థాంక్యూ. ఈ సినిమా మాకు ఇచ్చిన డైరెక్టర్ విజయ గారికి జీవితాంతం రుణపడి ఉంటాం. సినిమాని అద్భుతంగా ప్రజెంట్ చేశారు.మా టీమ్ అందరికీ థాంక్ యూ. తమ్ముడు సాయి శ్రీనివాస్ గ్రేట్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. రోహిత్ బాబాయ్ కంగ్రాట్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
9 సంవత్సరాలు తర్వాత వచ్చిన నాకు ఇంత ప్రేమ ఆదరణ చూపించిన ప్రతి ఒక్కరికి థాంక్యూ.రేపటి నుంచి ప్రతి ఒక్క ఊరికి రావడం జరుగుతుంది. ఇది విజల్స్ వేసి గోల చేసే సినిమా.ప్రతి ఒక్కరూ వెళ్లి థియేటర్స్ లో చూడండి.ఈ సినిమాని ఇంకొంచెం పెద్ద విజయం చేసి సూపర్ డూపర్ హిట్ చేస్తారని కోరుకుంటున్నాను అని అన్నారు.
ఇక మంచు మనోజ్ ప్రస్తుతం మిరాయ్ లో నటిస్తున్నాడు.తేజ సజ్జా ఇందులో హీరోగా నటిస్తుండగా మనోజ్ విలన్ పాత్ర చేస్తున్నాడు.రీసెంట్ గా టీజర్ రాగ సూపర్ రెస్పాన్స్ వచ్చింది.కార్తీక్ ఘట్టమనేని ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.సెప్టెంబర్ 5న విడుదలకానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























