సూర్య 46 షూట్ అప్డేట్

suriya 46 shoot starts from may 30

తమిళ స్టార్ హీరో సూర్య, టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తన 46వ సినిమా చేయనున్నాడని తెలిసిందే. రీసెంట్ గానే ఈ ప్రాజెక్ట్ లాంఛ్ కూడా అయ్యింది.ఇక ఈసినిమా ఈనెల 30 నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.అయితే సూర్య ఆలస్యంగా షూటింగ్ లో జాయిన్ కానున్నాడని సమాచారం.ఇందులో సూర్య సరసన ప్రేమలు ఫేమ్ మామితా బైజు నటించనుండగా రవీనా టాండన్ ,రాధికా శరత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్నాయి.వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక సార్ ,లక్కీ భాస్కర్ లతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టి ప్రస్తుతం పీక్ ఫామ్ లో వున్నాడు వెంకీ అట్లూరి.దాంతో తన నెక్స్ట్ మూవీ పై భారీ అంచనాలు వున్నాయి.సూర్య హిట్ కొట్టి చాలా ఏళ్ళు దాటిపోయింది.అయితే ఫామ్ తో సంబంధం లేకుండా సూర్య ఈసినిమాకు హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.

ఇక సూర్య ప్రస్తుతం తన 45వ సినిమాలో నటిస్తున్నాడు.ఆర్ జె బాలాజీ డైరెక్ట్ చేస్తుండగా త్రిష కథానాయికగా నటిస్తుంది.జూన్ ఫస్ట్ వీక్ లో సూర్య పార్ట్ షూటింగ్ కంప్లీట్ కానుంది.యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మిస్తుంది.దీపావళికి రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

ఇదిలావుంటే సూర్య రీసెంట్ గా రెట్రోతో రాగ ఈసినిమా కూడా తనకు కావాల్సిన విజయాన్ని అందించలేకపోయింది.తమిళంలో యావరేజ్ అనిపించుకోగా తెలుగులో అయితే పూర్తిగా నిరాశపరిచింది.ఈసినిమా ఈనెల 31న నెట్ ఫ్లిక్స్ లోకి వస్తుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.