కోలీవుడ్ స్టార్ సూర్య ‘కంగువా’ తర్వాత చేసిన హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘రెట్రో’. తన హోం బ్యానర్ 2D ఎంటర్టైన్మెంట్పై ఆయనే స్వయంగా నిర్మించిన ఈ చిత్రానికి క్రేజీ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించాడు. కన్నడ భామ పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా.. మలయాళ నటుడు జోజు జార్జ్ విలన్ పాత్రలో కనిపించాడు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించగా.. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ, మహ్మద్ షఫీక్ అలీ ఎడిటింగ్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దాదాపు 2గంటల 48నిమిషాల భారీ రన్ టైంతో మే 1న థియేటర్లలోకి వచ్చిన రెట్రో తమిళంతోపాటు తెలుగు, హిందీలో కూడా విడుదలయింది. తెలుగులో ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ రిలీజ్ చేసింది. అయితే అదే రోజు నాని హీరోగా నటించిన ‘హిట్ 3’ రూపంలో బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఎదురయినా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ మంచి వసూళ్లే అందుకుంది.
రూ.200 కోట్లకుకు పైగా కలెక్షన్స్ సాధించి సూర్య కెరీర్లో ఈ ఫీట్ అందుకున్న తొలి సినిమాగా చరిత్ర సృష్టించింది. దీంతో రెట్రో సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కోసం మూవీ లవర్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ వేదికగా ఈ నెల 31 నుంచి స్రీమింగ్ కానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























