డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటిస్తున్న తన అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్‌తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. ఇది పూర్తి స్థాయి మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్గా ఉండబోతోంది. పూరి సిగ్నేచర్ స్టైల్, విజయ్ సేతుపతి మాగ్నెటిక్ స్క్రీన్ ప్రెజెన్స్ బ్లెండ్ చేసే ప్రత్యేకమైన కథాంశంతో విభిన్నంగా ఉంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. మొత్తం కాస్ట్ అండ్ క్రూ ఇప్పటికే ఖరారు కావడంతో, టీం ప్రస్తుతం హైదరాబాద్, చెన్నై అంతటా రెక్కీ చేస్తున్నారు. మొదటి షూటింగ్ షెడ్యూల్ కోసం సరైన లొకేషన్ల కోసం వెతుకుతున్నారు.
జూన్ చివరి వారంలో షూటింగ్ ప్రారంభంకానున్న ఈ ప్రాజెక్ట్ ఒక ముఖ్యమైన కొలాబరేషన్ని సూచిస్తోంది. పూరి జగన్నాథ్ క్రియేటివ్, టెక్నికల్ అంశాలన్నింటిలోనూ చాలా కేర్ తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా ఎంచుకున్న లొకేషన్లు విజువల్ స్టొరీ టెల్లింగ్‌కి వున్న ప్రాధాన్యత సూచిస్తున్నాయి.
విజయ్ సేతుపతి, ఇతర ప్రధాన నటుల మొదటి షెడ్యూల్ నుంచే షూటింగ్లో పాల్గొనున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి నెవర్ బిఫోర్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. ఎవర్గ్రీన్ నటి టబు, శాండల్‌వుడ్ డైనమో విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























