అడివి శేష్ హీరోగా తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ మూవీ ‘డకాయిట్’. తాజాగా ‘ఫైర్ గ్లింప్స్’ పేరుతో ఓ స్పెషల్ వీడియోను తెలుగు మరియు హిందీలో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇంటెన్స్ యాక్షన్, స్టైలిష్ విజువల్స్‌తో ఫైర్ గ్లింప్స్ అదిరిపోయింది. శేష్, మృణాల్ ఠాకూర్ మధ్య ఉద్రిక్త క్షణంలో గ్లింప్స్ ప్రారంభమౌతోంది. సానుభూతితో నిండిన వాయిస్‌లో శేష్ ఆమెను ‘జూలియట్’ అని పిలుస్తాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అందరూ ఆమెకు అన్యాయం చేశారని చెబుతాడు. కానీ వెంటనే అతని వాయిస్ మారుతుంది. నేను నిన్ను మోసగించడానికి రాలేదు, అంతకంటే ఎక్కువ చేస్తా అని మిస్టీరియస్ స్మైల్‌తో శేష్ చెప్పే డైలాగ్ అదిరిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్, ఖైదీ యూనిఫాంలో జైలు వ్యాన్‌లో వున్న శేష్ కూల్‌గా తన నోటి నుండి ఒక కీని బయటకు తెస్తాడు. తర్వాత ఓ రైలు వ్యాన్ మీదుగా దూసుకెళ్తుంది.
చివరి సన్నివేశంలో, మృణాల్ అతని పక్కన కూర్చుంటుంది, శేష్ ఫైరింగ్ చేస్తాడు. ప్రేమ, ప్రతీకారం, మోసంతో నిండిన ఓ గొప్ప కథకు ఇది నాంది. విజువల్‌గా డకాయిట్ ఫైర్ గ్లింప్స్ కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. అడివి శేష్ ఇంటెన్స్ అండ్ రగ్గడ్ పాత్ర కోసం పూర్తిగా మేకోవర్ అయ్యారు. మదనపల్లె యాసలో అదరగొట్టాడు. అతని వాయిస్ మాడ్యులేషన్, ఎక్స్‌ప్రెషన్స్ అద్భుతంగా వున్నాయి. హిందీ వెర్షన్‌కు కూడా తనే డబ్బింగ్ చెప్పడం విశేషం. అయితే అది అద్భుతంగా వచ్చింది.
మృణాల్ ఠాకూర్ స్ట్రాంగ్ క్యారెక్టర్‌లో కనిపించింది. ఆమె పాత్ర వెనక కథ చాలా ఆసక్తి కలిగిస్తుంది. అనురాగ్ కశ్యప్ ప్రజెన్స్ ఇంపాక్ట్ ఫుల్‌గా వుంది. దర్శకుడు షానియల్ డియో విజువల్ ప్రజెంటేషన్ అదరగొట్టాడు. మొత్తానికి ఈ సినిమా స్కేల్ ఎంత బిగ్గర్‌గా వుంటుందో ఈ టీజర్ తెలియజేసింది. భీమ్స్ సిసిరోలియో నేపథ్య సంగీతం ఎమోషన్‌ని మరింత ఎలివేట్ చేసింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























