పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌లతో దూసుకుపోతున్న రెబెల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కలసి చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘స్పిరిట్’. ‘యానిమల్’ ఫేం తృప్తి డిమ్రీ ఈ చిత్రంలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా ఎంపికైనట్లు మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ మేరకు తాజాగా సందీప్ రెడ్డి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యానిమల్ చిత్రంలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న తృప్తి, దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో మళ్లీ పనిచేయడం పట్ల, అలాగే ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేయడం పట్ల ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పిరిట్‌ను తొమ్మిది భాషల్లో విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు. ఇది పాన్ వరల్డ్ విజన్‌ని తెలియజేస్తోంది.
భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్స్, టీ-సిరీస్ ఫిల్మ్స్ బ్యానర్లపై ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్, మురాద్ ఖేతానీ నిర్మిస్తున్న ఈ చిత్రం, భారత సినిమా చరిత్రలోనే ఒక గొప్ప ప్రాజెక్టుగా నిలవనుంది. రెబెల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేయబోతోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























