దసరా కాంబినేషన్ లో ది ప్యారడైజ్ రానుందని తెలిసిందే.అనౌన్స్ మెంట్ గ్లింప్స్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది.డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ,నానిని ఈసారి మరింత రా & బోల్డ్ గా చూపించనున్నాడు.ఇక ఈసినిమాను మే లోనే సెట్స్ మీదకు తీసుకెళ్దామనుకున్నారు కానీ అది కాస్త వాయిదాపడింది.ప్రస్తుతం ఫైట్ ప్రాక్టీస్ జరుగుతుంది.మరో 10 రోజులపాటు ఈ రిహార్సల్స్ కొనసాగనున్నాయి.దాంతో షూట్ ఆలస్యం కానుంది.ఇప్పటికే హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ లో ఓ భారీ సెట్ వేశారు.జూన్ నుండి అందులో షూటింగ్ స్టార్ట్ కానుంది.డిసెంబర్ లోపు కంప్లీట్ చేసి చెప్పిన తేదీ ప్రకారం వచ్చే ఏడాది మార్చి 26న రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.ఈసినిమా ఏకంగా 8 భాషల్లో రిలీజ్ కానుంది.అందులో భాగంగా ఇంగ్లీష్ ,స్పానిష్ భాషల్లో కూడా విడుదలకానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాకు డీఓపీ మారనున్నాడని సమాచారం.ముందు జికె విష్ణు ను తీసుకోవాలనుకున్నారు కానీ తను అల్లు అర్జున్ -అట్లీ మూవీకి కమిట్ అవ్వడంతో అతని స్థానంలో ఇప్పుడు మరొకరిని ఎంపికచేయనుంది ది ప్యారడైజ్ టీం.సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా దసరా నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
ఇక రీసెంట్ గా హిట్ 3 తో మరో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్నాడు నాని.ఈసినిమా 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.థియేట్రికల్ రన్ ఎండింగ్ కు చేరడం తో ఈనెల 29 నుండి నెట్ ఫ్లిక్స్ లోకి రానుంది.శైలేష్ కొలను ఈసినిమా డైరెక్ట్ చేయగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























