ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ ‘తమ్ముడు’. ఈ చిత్రంలో సీనియర్ యాక్ట్రెస్ లయ కీలక పాత్రను పోషిస్తున్నారు. ప్రస్తుతం తమ్ముడు చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘మూడ్ ఆఫ్ తమ్ముడు’ పేరుతో గ్లింప్స్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తమ్ముడు విడుదల వాయిదాపడినట్టు తెలిపారు నిర్మాత దిల్ రాజు. ఈ మేరకు నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ సినిమా అదే డేట్ కి వస్తున్న కారణంగా రెండు సినిమాల మధ్య క్లాష్ అవకూడదనే ఉద్దేశంతో తమ్ముడు చిత్రాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్టు వెల్లడించారు. అయితే, ఇంతకుముందు ప్రకటించిన ప్రకారం, ఈ సినిమా జులై 4న విడుదలకావాల్సి ఉండగా, తాజాగా వాయిదా వేశారు.
అయితే రీసెంట్‌గా విజయ్ దేవరకొండ హైలీ యాంటిసిపేటెడ్ ‘కింగ్‌డమ్’ ముందు చెప్పిన డేట్ మే 30న కాకుండా, జులై 4న వస్తున్నట్టు సితార సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రెండు సినిమాల మధ్య క్లాష్ తప్పదని అందరూ అనుకున్నారు. ఈ నేపథ్యంలో అదేరోజు విడుదల కావాల్సిన తమ్ముడు ఇప్పుడు పోస్ట్‌పోన్ అయింది. కాగా ఈ రెండు చిత్రాల నిర్మాతలు దిల్ రాజు, నాగవంశీల మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే.
ఇటీవల వచ్చిన ‘రాబిన్‌హుడ్’ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో తమ్ముడు చిత్రంతో అయినా ఈసారి సాలిడ్ హిట్ అందుకోవాలనే కసితో వున్నాడు నితిన్. దిల్ రాజు ప్రొడక్షన్ నుండి వస్తోన్న మూవీ కావడంతో దీనిపై అంచనాలు భారీగానే వున్నాయి. ఇక బాక్సాఫీస్ వద్ద సోలోగా రానుండటం కూడా నితిన్‌కి కలిసిరానుంది. మరోవైపు నితిన్ దీనితర్వాత దిల్ రాజు నిర్మిస్తున్న ‘ఎల్లమ్మ’లో జాయిన్ కానున్నాడు. ఈ చిత్రానికి ‘బలగం’ ఫేమ్ వేణు ఎల్దండి దీనికి దర్శకత్వం వహించనున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























