బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ హీరోలుగా కలిసి నటించిన సినిమా భైరవం.తమిళ సినిమా గరుడన్ కు రీమేక్ గా నాంది ఫేమ్ విజయ్ కనకమేడల డైరెక్షన్ లో తెరకెక్కింది.ఈనెల 30న థియేటర్లోలోకి రానుంది.ఈసందర్భంగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.సెన్సార్ బోర్టు ఈసినిమాకు ఏ సర్టిఫికెట్ ను జారీ చేసింది.వైలెన్స్ ఎక్కువగా ఉండడంతో ఏ సర్టిఫికెట్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే రీసెంట్ గా ఏ సర్టిఫికెట్ తో వచ్చిన నాని హిట్ 3 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సూపర్ హిట్ అనిపించుకుంది.టాక్ బాగుంటే భైరవంకు ఏ సర్టిఫికెట్ వల్ల వచ్చే నష్టం ఏమి ఉండదు.యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో హైలైట్ అవ్వనున్నాయట.రన్ టైం కూడా రివీల్ అయ్యింది. 2 గంటల 35 నిమిషాల నిడివితో థియేటర్లలోకి రానుంది.ప్రస్తుతం భైరవం టీం ప్రమోషన్స్ తో బిజీగా వుంది. అందులో భాగంగా రేపు హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది.
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె. రాధామోహన్ ఈసినిమాను నిర్మించగా అదితి శంకర్, ఆనంది, దివ్యా పిళ్ళై హీరోయిన్లుగా నటించారు. శ్రీచరణ్ పాకాల ఈసినిమాకు సంగీతం అందించారు.ఇక చాలా గ్యాప్ తరువాత సాయి శ్రీనివాస్ ,మంచు మనోజ్ ,నారా రోహిత్ థియేట్రికల్ రిలీజ్ తో వస్తున్నారు. మరి భైరవం వీరికి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























