బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘భైరవం’. అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్ళై ఫిమేల్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ‘ఉగ్రం, నాంది’ చిత్రాల ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వంలో శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీ నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గడా సమర్పిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుత స్పందనతో, ఈ సినిమా పాజిటివ్ బజ్‌తో ముందుకు దూసుకెళ్తోంది. రీసెంట్‌గా మూవీ టీం థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తొలి షాట్ నుండి చివరి ఫ్రేమ్ వరకు ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. యాక్షన్, ఎమోషన్స్ సమర్థంగా మేళవించిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
ఈ నేపథ్యంలో తాజాగా భైరవం నుండి ‘గిచ్చమాకు’ అనే లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. డ్రమ్స్, ఎలక్ట్రిఫైడ్ బీట్స్‌తో ఈ సాంగ్ అదిరిపోయింది. సౌండ్ కలర్ ఫుల్ ఫెస్టివల్ మూడ్‌తో గిచ్చమాకు సాంగ్ కట్టిపడేసింది. కాసర్ల శ్యామ్ లిరిక్స్ మాస్‌ని ఆకట్టుకునేలా వున్నాయి. ధనుంజయ్ సీపాన, సౌజన్య భగవతుల ఎనర్జిటిక్ వోకల్స్‌తో కట్టిపడేశారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బెస్ట్ డ్యాన్స్ మూవ్స్‌తో అదరగొట్టేశారు. అదితి శంకర్ ప్రజెన్స్ ఆకట్టుకుంది. ఈ ఇద్దరూ కలసి ప్రతి ఫ్రేమ్ ఫెస్టివల్ వైబ్‌తో అలరించారు. ఫోక్ బ్యాక్‌డ్రాప్‌లో చిత్రీకరించబడిన ఈ పాట సంప్రదాయం, ఉత్సాహంతో అలరించింది. బిగ్ స్క్రీన్‌పై ఈ సాంగ్ విజువల్ ట్రీట్‌లా ఉండబోతోంది.
ఇక భైరవం చిత్రానికి శ్రీ చరణ్ పాకాల నేపథ్య సంగీతం మరియు సాంగ్స్ అందిస్తుండగా.. హరి కె వేదాంతం కెమెరా, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనింగ్, చిన్నా కె ప్రసాద్ ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. సత్యర్షి, తూమ్ వెంకట్ పవర్‌ఫుల్ డైలాగ్స్ రాస్తుండగా.. ఫైట్ మాస్టర్స్ రామకృష్ణ, నటరాజ్ మాడిగొండ అదిరిపోయే యాక్షన్ ఘట్టాలను డిజైన్ చేస్తున్నారు. కాగా భైరవం సినిమా మే 30న ఈ వేసవి సీజన్‌లో బిగ్గెస్ట్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: