ప్రముఖ బాలీవుడ్ నటుడు, మోడల్ ముకుల్ దేవ్ కన్నుమూశారు. శుక్రవారం రాత్రి ఆయన 54 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. ముకుల్ దేవ్ మరణవార్తను ఆయన సన్నిహితురాలు, నటి దీప్శిఖా నాగ్‌పాల్ ధృవీకరించారు. అయితే ముకుల్ మృతికి గల కారణాలు తెలియాల్సివుంది. గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు సమాచారం. కాగా ముకుల్, మరో బాలీవుడ్ స్టార్ నటుడు రాహుల్ దేవ్‌కి సోదరుడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ముకుల్ దేవ్ హిందీలో ‘సన్ ఆఫ్ సర్దార్, ఆర్.. రాజ్ కుమార్, జై హో’ వంటి చిత్రాలలో తన నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆయన తెలుగులోనూ కొన్ని సినిమాలలో నటించారు. ప్రభాస్ ‘ఏక్ నిరంజన్’, రవితేజ ‘కృష్ణ’, ఎన్టీఆర్ ‘అదుర్స్’ చిత్రాలలో విలన్ పాత్రల్లో నటించారు ముకుల్. ఆయన చివరిగా ‘అంత్ ది ఎండ్’ అనే హిందీ చిత్రంలో కనిపించారు.
న్యూఢిల్లీలో పంజాబీ కుటుంబంలో జన్మించిన ముకుల్ దేవ్, 1996లో ‘ముమ్కిన్’ అనే టెలివిజన్ సీరియల్‌తో యాక్టింగ్ కెరీర్ ప్రారంభించారు. అలాగే దూరదర్శన్‌లో ప్రసారమైన టాప్ కామెడీ బాలీవుడ్ కౌంట్‌డౌన్ షో ‘ఏక్ సే బద్ కర్ ఏక్’లో కూడా ఆయన నటించారు. అనంతరం ‘దస్తక్’ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కాగా ముకుల్ దేవ్ ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉరాన్ అకాడమీ నుండి శిక్షణ పొందిన పైలట్ కావడం గమనార్హం.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























