నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్: ది థర్డ్ కేస్’. హిట్ యూనివర్స్‌లో భాగంగా మూడవ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఆయన మోస్ట్ టెర్రిఫిక్ అండ్ బ్రూటల్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్‌గా నటించాడు. నాని సరసన ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేశారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సహా అన్నీ హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో భారీ అంచనాల మధ్య హిట్ 3 మే 1న పాన్ ఇండియా వైడ్‌గా థియేటర్లలోకి వచ్చిన హిట్ 3 బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసేసింది. విడుదలైన అన్నిచోట్లా సక్సెస్‌ఫుల్ రన్‌తో కళ్ళు చెదిరేలా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ కోసం మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో హిట్ 3 ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈనెల 29 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్టు సదరు సంస్థ వెల్లడించింది.
హిట్ 3 కథ:-
అర్జున్ సర్కార్ (నాని) వైజాగ్ హిట్ టీమ్‌లో ఎస్.పి.గా పనిచేస్తుంటాడు. తన విధి నిర్వహణలో భాగంగా వేర్వేరు ప్రదేశాలలో ఒకేలా జరిగిన హత్యలను గమనిస్తాడు. ఇలా దేశవ్యాప్తంగా మొత్తం 13 హత్యలు జరిగిన విధానం అర్జున్ సర్కార్ ను ఆలోచనలో పడేస్తుంది. దీంతో ఈ హత్యల వెనకున్న నిజాన్ని వెలికితీసేందుకు తన టీమ్ మెంబర్స్ వర్ష (కోమలి ప్రసాద్), దివాకర్ (చైతు జొన్నలగడ్డ) లతో కలిసి ఈ ఆపరేషన్ ను పై అధికారి నాగేశ్వరరావు (రావు రమేశ్) అనుమతితో టేకప్ చేస్తాడు. ఇక్కడినుండి కథ శ్రీనగర్ నుండి బీహార్>> అక్కడినుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు సాగుతుంది.
అయితే అర్జున్ సర్కార్ ఈ సీరియల్ క్రైమ్స్‌ని అడ్డుకోగలిగాడా? దీని వెనకున్న కిల్లర్స్ గ్యాంగ్‌ని పట్టుకోగలిగాడా? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? వాటిని అతను ఎలా అధిగమించాడు? మృదుల (శ్రీనిధి శెట్టి) ఎవరు? ఆమెతో అర్జున్ సర్కార్ ప్రేమాయణం ఏమైంది? అసలు అతను క్రిమినల్స్ పట్ల ఎందుకంత వైల్డ్‌గా రియాక్ట్ అవుతుంటాడు? ఈ మూవీ సీక్వెల్ హిట్ 4కి సంబంధించి చివరిలో ఏమైనా లీడ్ ఇచ్చారా? క్లైమాక్స్‌లో వచ్చే సర్‌ప్రైజ్ ఏంటి? అన్నదే మిగతా కథ.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























